Sunday, October 2, 2022
Sunday, October 2, 2022

వరద గోదావరి..

నిజామాబాద్‌ జిల్లాలో ఎడతెరపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రెంజల్‌ మండలం కందకుర్తి త్రివేణి సంగమం వద్ద గోదావరిలోకి వరద పోటెత్తింది. గోదావరి పరివాహక ప్రాంతంలో పంటపొలాలు నీటమునిగాయి. భారీగా వరద వస్తుండటంతో నదీ పరివాహక ప్రాంతంలోని ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. గోదావరి నది ఈ స్థాయిలో ప్రవహించడం గత 15 ఏండ్లలో ఇదే తొలిసారని స్థానికులు చెబుతున్నారు. ఎగువ మహారాష్ట్ర నుంచి వస్తున్న గోదావరి జిలాలకు మంజీరా వరద తోడవడంతో ఈ స్థాయిలో ప్రవాహం కనిపిస్తోందని అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img