Tuesday, May 28, 2024
Tuesday, May 28, 2024

సింగరేణి గనిలో ఎయిర్‌ బ్లాస్ట్‌.. కార్మికుడికి గాయాలు

సింగరేణి గనిలో ఎయిర్‌ బ్లాస్ట్‌ అయ్యింది. దీంతో ఓ కార్మికుడు గాయపడ్డ ఘటన పెద్దపెల్లి జిల్లా ఆర్జీ వన్‌ పరిధిలోని 11 ఏ ఇంక్లైన్‌ గనిలో చోటుచేసుకుంది. మంగళవారం తెల్లవారుజామున కార్మికులు విధులు నిర్వహిస్తున్న సమయంలో ఎయిర్‌ బ్లాస్ట్‌ కావడంతో అక్కడే విధులు నిర్వహిస్తున్న కార్మికుడు ఆర్‌. రవికుమార్‌(34) తలకు తీవ్ర గాయం అయ్యింది. గనిలో పనిచేస్తున్న కార్మికులు పరుగులు తీశారు. గాయపడ్డ కార్మికుడు రవిని సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స జరుపుతున్నారు. భారీ నష్టం తప్పడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img