test
Sunday, May 26, 2024
Sunday, May 26, 2024

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన మంత్రి నిరంజన్‌రెడ్డి

ప్రజల ఆశీస్సులే ప్రభుత్వానికి అండ అని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి అన్నారు. సోమవారం వనపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లా కేంద్రం చుట్టూ ఉన్న నల్లచెరువు, తాళ్ల చెరువు, ఈదుల చెరువు, రాజనగరం చెరువు, శ్రీనివాసపూర్‌ లక్ష్మీకుంటలను పునర్నిర్మించి పటిష్టం చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు అహ్లాదకర వాతావరణం ఆస్వాదించేలా చెరువులు, కుంటలపై వాకింగ్‌ ట్రాక్‌ లు, బోటింగ్‌, గార్డెనింగ్‌ వంటి సుందరీకరణ పనులు చేపడతామని పేర్కొన్నారు. వనపర్తి రోడ్ల విస్తరణ కొనసాగుతున్నది. పట్టణం నుంచి వచ్చే మురుగునీటి వ్యవస్థను శుద్ధి చేసేందుకు సీవరేజ్‌ ప్లాంట్‌ నిర్మిస్తామన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img