Monday, April 22, 2024
Monday, April 22, 2024

హైదరాబాద్‌లో నాలుగు రోజుల పాటు ఎంఎంటీఎస్ రైళ్ల రద్దు.. !

హైదరాబాద్ – సికింద్రాబాద్ నగరాల మధ్య సేవలు అందించే 22 ఎంఎంటీస్ రైళ్లను రెండు రోజుల నుండి నాలుగు రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. నిర్వహణ పనుల కారణంగా ఈ నెల 14, 15 తేదీల్లో కొన్ని రైళ్లు, 14 నుండి 17 తేదీల మధ్య మరిన్ని రైళ్లు రద్దు చేసినట్లు వెల్లడించింది. 14, 15 తేదీల్లో లింగంపల్లి – హైదరాబాద్ రైళ్లు, 14 వ తేదీ నుండి 17 వరకు ఉందానగర్ – లింగంపల్లి, లింగంపల్లి – ఫలక్ నుమా, రామచంద్రాపురం – ఫలక్ నుమా మార్గాల్లో రైళ్లను రద్దు చేసినట్లు తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img