Friday, August 19, 2022
Friday, August 19, 2022

హైదరాబాద్‌లో వాన.మరో రెండు రోజులు భారీ వర్షాలు

రుతుపవనాల ప్రభావంతో హైదరాబాద్‌ నగరవ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో వర్షం కురుస్తోంది. దీంతో పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్‌జాం కావడంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ వ్యాప్తంగా వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, అమీర్‌పేట, హయత్‌నగర్‌, ఇంజాపూర్‌, తుర్కయాంజల్‌, అబ్దుల్లాపూర్‌మెట్‌, చార్మినార్‌, చాంద్రాయణగుట్ట, ఫలక్‌నుమా, లంగర్‌హౌస్‌, గోల్కొండ, కార్వాన్‌, మెహదీపట్నం, రాంజేంద్రనగర్‌, శంషాబాద్‌, నాంపల్లి, కొండాపూర్‌, మియాపూర్‌, అంబర్‌పేట, బేగంబజార్‌, ఛత్రినాక, శివగంగానగర్‌, శివాజీనగర్‌, గగన్‌పహడ్‌లో వర్షం కురుస్తోంది. కాగా, రాగల రెండు మూడు రోజుల్లో రాజధానిలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదవుతాయని వెల్లడిరచింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో వాన కురిసింది. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని జడ్చర్ల, రాజాపూర్‌, బాలానగర్‌, మిడ్జిల్‌, నవాబ్‌పేట, రంగారెడ్డి జిల్లాలోని తలకొండపల్లి, మాడ్గుల, కడ్తాల్‌, ఆమన్‌గల్‌ మండలాల్లో వర్షం కురిసింది. అదేవిధంగా సూర్యాపేట జిల్లాలోని హుజూర్‌నగర్‌, నల్లగొండ జిల్లాలోని దేవరకొండలో భారీ వర్షం పడిరది. పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది.అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలోని సంగంలో 15.93 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img