Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

ఫీల్డ్‌ అసిస్టెంట్లు, సెర్ఫ్‌, మెప్మా ఉద్యోగులకు సీఎం గుడ్‌న్యూస్‌


తెలంగాణ బడ్జెట్‌ సమావేశాల్లో చివరిరోజు సీఎం కేసీఆర్‌ సభలో ద్రవ్య వినిమయ బిల్లు ప్రవేశపెట్టారు. అనంతరం బిల్లుపై చర్చ జరిగింది. ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చకు కేసీఆర్‌ సమాధానమిస్తూ మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ఫీల్డ్‌ అసిస్టెంట్లు, సెర్ఫ్‌, మెప్మా ఉద్యోగులకు సీఎం శుభవార్త చెప్పారు. సెర్ఫ్‌లో 4,500 మంది పని చేస్తున్నారు. సెర్ఫ్‌ సొసైటీ.. ప్రభుత్వ ఉద్యోగులు కాదు. అయినప్పటికీ మహిళా సంఘాలను చైతన్యం చేసేందుకు, ఆర్గనైజింగ్‌ కెపాసిటీ పెంచేందుకు విశేష కృషి చేస్తున్నారు. మంచి ఫలితాలు వస్తున్నాయి. సర్ఫ్‌ ఉద్యోగులందరికీ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇస్తాం. ఫీల్డ్‌ అసిస్టెంట్స్‌ అని చెప్పి ఉపాధిహామీలో పని పని చేస్తారు. వారు ప్రభుత్వ ఉద్యోగులు కాదు. ఓ భ్రమలో సమ్మెకు వెళ్లారు. సమ్మె వద్దని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి, సంబంధిత శాఖ అధికారులు చెప్పినా వినకుండా వెళ్లారు. ఇప్పుడు తప్పయిందని అక్కడికి ఇక్కడి తిరుగుతున్నరు. వాళ్లపై మాకేం కోపం లేదు. ఆ అవసరం లేదు. వారికి పెద్దన్నలా హెచ్చరిస్తున్నా.. ఇకపై పొరపాట్లు పునరావృతం చేయొద్దు. మానవతా దృక్పథంతో తీసుకుంటాం. మళ్లీ ఫీల్డ్‌ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకుంటాం. వాళ్లు పొరపాటు చేశారు.. పెద్ద మనసుతో వాళ్లను క్షమించాలని ఎమ్మెల్యేలు కోరుతున్నారు. ఇకపై మళ్లీ ఆ తప్పుమని చేయమని చెప్పారు. అందరి మాటనే నా మాట.. వారందరిని విధుల్లోకి తిరిగి తీసుకుంటాం’ అని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ఆ తర్వాత మెప్మా ఉద్యోగులకు సైతం ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇస్తామని అన్నారు. వాళ్లను సైతం పరిగణలోకి తీసుకుంటామన్నారు. పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ శాఖల మంత్రులు ఆర్థిక మంత్రితో కలిసి లెక్కలు తేల్చి, అందరికీ న్యాయం చేస్తాం’ అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img