Tuesday, May 7, 2024
Tuesday, May 7, 2024

24 గంటల్లో అల్పపీడనం ..తెలంగాణకు వర్షసూచన

దక్షిణ బంగాళాఖాతంలో రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, ఈ ప్రభావంతో ఈ నెల 27 వరకు తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.ఆగ్నేయ బంగాళాఖాతంలో సోమవారం ఏర్పడిన ఉపరితల ఆవర్తనం.. మంగళవారం దక్షిణ బంగాళాఖాతంలో కొనసాగుతూ సముద్ర మట్టానికి 5.8 కిలో మీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉందని తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణలోకి తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి కింది స్థాయి గాలులు బలంగా వీస్తున్నాయని పేర్కొన్నది. దీంతో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని, ఈశాన్య దిశ ఉపరితల గాలులు గంటకు ఆరు నుంచి పన్నెండు కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img