Friday, June 14, 2024
Friday, June 14, 2024

తెలంగాణలో విద్యాసంవత్సరం క్యాలెండర్ విడుదల… జూన్ 12న స్కూల్స్ ప్రారంభం

తెలంగాణలో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి క్యాలెండర్‌ను విడుదల చేశారు. జూన్ 12వ తేదీన పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. వచ్చే ఏడాది 23 ఏప్రిల్ వరకు కొనసాగుతాయి. 28 ఫిబ్రవరి 2025 లోపు పదో తరగతి ప్రీ-ఫైనల్ పరీక్షలు జరగనున్నాయి. మార్చిలో పదో తరగతి పరీక్షలు ఉంటాయి. అక్టోబర్ 2 నుంచి 14వ తేదీ వరకు దసరా సెలవులు, డిసెంబర్ 23 నుంచి 27 వరకు క్రిస్మస్ సెలవులు, జనవరి 13 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు ఇచ్చారు. ఉన్నత పాఠశాలలు ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4.45 వరకు, అప్పర్ ప్రైమరీ పాఠశాలలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4.15 వరకు నిర్వహిస్తారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img