Wednesday, May 22, 2024
Wednesday, May 22, 2024

తెలంగాణలో సింగిల్ స్క్రీన్ థియేటర్లు బంద్

తెలంగాణలో రానున్న పది రోజుల సినిమా థియేటర్లు మూగబోనున్నాయి. ఆక్యుపెన్సీ తక్కువగా ఉన్నందువల్ల రాబోయే 10 రోజుల పాటు సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూసివేతకు సింగిల్ స్క్రీన్ థియేటర్ల యాజమాన్యాల అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. శుక్రవారం నుంచి వరుసగా 10 రోజుల పాటు సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడనున్నాయి. గత కొంతకాలంగా రాష్ట్రంలో మల్టీస్క్రీన్లు పెరిగిపోవటంతో.. సింగిల్ స్క్రీన్ థియేటర్లకు ప్రేక్షకులు లేక వెలవెలబోతున్నాయి. నష్టాన్ని తగ్గించుకునేందుకు సింగిల్ స్క్రీన్ థియేటర్ల యజమానులు ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే.. నిర్మాతలు ముందుకు వచ్చి మెయింటెనెన్స్ భరిస్తామంటే.. థియేటర్లు ఓపెన్ చేస్తామని యాజమాన్యాల అసోసియేషన్ ప్రకటించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img