Friday, May 3, 2024
Friday, May 3, 2024

శ్రీరామనవమికి భ‌ద్రాద్రి ముస్తాబు.. నేడు ఎదురుకోలు వేడుక‌

భ‌ద్రాచలంలో శ్రీరామనవమికి అన్ని ఏర్పాట్లు చేశారు. రేపు సీతారాముల కల్యాణం జరగనుంది. అయితే శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా ఇవాళ ఎదరుకోలు ఉత్సవాన్ని పండితులు నిర్వహిస్తున్నారు.
17న జరిగే శ్రీ రామనవమి కోసం వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో రూ. 3కోట్ల వ్యయంతో ఏర్పాట్లు చేస్తున్నారు. భద్రాచలంలో సీతారాముల కల్యాణం నేపథ్యంలో ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. రామాలయ ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. శ్రీ సీతారాముల కల్యాణం జరిగే మిథిలా కళ్యాణ మంటపాన్ని సుందరంగా అలంకరిస్తున్నారు.

నేడు ఎదురుకోలు వేడుక‌
భద్రాద్రిలోని రామాలయం ఉత్తర ద్వారం వద్ద ఈ ఎదురుకోలు ఉత్సవాన్ని నిర్వహించనున్నారు. రేపు మిధిలా స్టేడియంలో సీతారామ కల్యాణం జరగనుంది. రేపు సీతారామ కల్యాణం సీతారామ కల్యాణం సందర్భంగా పెద్దయెత్తున భక్తులు భద్రాద్రికి చేరుకుంటున్నారు. సీతారామలు కల్యాణాన్ని తిలకించేందుకు ఎక్కువ మంది భక్తులు వస్తుండటంతో అందుకు తగిన ఏర్పాట్లను ఆలయ అధికారులు చేస్తున్నారు.
అన్ని ఏర్పాట్లు పూర్తి
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లను అధికారులు చేపడుతున్నారు. ఇప్పటికే రామాలయ ప్రాంగణానికి రంగులు దిద్ది సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. విద్యుత్ అలంకరణలతో రామాలయ ప్రాంగణమంతా శోభాయమానంగా వెలుగొందుతోంది. సీతారాముల కళ్యాణం జరిగే మిథిలా కళ్యాణ మంటపానికి తుది మెరుగులు దిద్దుతున్నారు. కళ్యాణం వీక్షించేందుకు కళ్యాణ మంటపంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు, భక్తులకు ప్రత్యేక సెక్టార్లను ఏర్పాట్లు చేశారు. కళ్యాణం వీక్షించే భక్తులు ఇబ్బందులకు గురి కాకుండా సెక్టార్లలో సీతారాముల కళ్యాణానికి వచ్చే భక్తులకు అందించేందుకు దేవస్థానం అధికారులు 250 క్వింటాళ్లతో రెండున్నర లక్షల ముత్యాల తలంబ్రాల ప్యాకెట్లను సిద్ధం చేస్తున్నారు. ఇక‌, వాహనాల పార్కింగ్ కోసం 8 చోట్ల పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు. 256 మరుగుదొడ్లను 14చోట్ల ఏర్పాటు చేశారు. పారిశుద్ధ్య సమస్య తలెత్తకుండా భద్రాచలం పట్టణాన్ని 15జోన్లుగా విభజించి 300 మంది సిబ్బందితో పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.
ప్రత్యేక కౌంటర్లు
స్వామి వారి కళ్యాణ క్రతువు పూర్తయిన వెంటనే దేవస్థానం అధికారులు ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లలో వీటిని భక్తులకు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తలంబ్రాల ప్యాకింగ్ కు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతోంది. ముత్యాలతో కూడిన తలంబ్రాలను ఈ సారి కార్గో, పోస్టల్ శాఖల ద్వారా పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే రాములోరి తలంబ్రాలు కలిపే ప్రక్రియ ప్రారంభం కావడంతో కళ్యాణానికి వచ్చే ప్రతి భక్తునికి తలంబ్రాల ప్యాకెట్లను అందించేందుకు దేవస్థానం ఆధ్వర్యంలో ఏర్పాట్లు సాగుతున్నాయి. అదే విధంగా స్వామి వారి లడ్డూ ప్రసాదాన్ని భక్తులకు అందించేందుకు రెండున్నర లక్షల లడ్డు ప్రసాద పాకెట్లను సిద్ధం చేస్తున్నారు.
రక్షణ వలయంలో భద్రాద్రి..

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img