Free Porn
xbporn

buy twitter followers
uk escorts escort
liverpool escort
buy instagram followers
Galabetslotsitesi
Galabetsondomain
vipparksitesigiris
vipparkcasinositesi
vipparkresmi
vipparkresmisite
vipparkgirhemen
Betjolly
Saturday, July 27, 2024
Saturday, July 27, 2024

గ్యారెంటీలకు పెద్దపీట

రూ.2.75 లక్షల కోట్లతో బడ్జెట్‌

. హామీల అమలుకు రూ.53,196 కోట్లు
. గ్రామీణ వ్యవస్థ బలోపేతానికి పెద్దపీట
. వ్యవసాయ, విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యం
. ఓట్‌ అన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి

విశాలాంధ్రహైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన నూతన ప్రభుత్వం ప్రజల అంచనాలకు అనుగుణంగా బడ్జెట్‌ ప్రవేశపెట్టింది. శనివారం శాసనసభలో ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా, శాసనమండలిలో రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ శ్రీధర్‌బాబు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అంతకుముందు రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై బడ్జెట్‌కు ఆమోద ముద్ర వేసింది. బడ్జెట్‌లో అందరూ ఉహించినట్టుగానే ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా వారు ప్రకటించిన ఆరు గ్యారెంటీలకు పెద్దపీట వేస్తూ పెద్దఎత్తున నిధులు కేటాయించింది. విద్య, వ్యవసాయ, వైద్య రంగాలకు ప్రాధాన్యత ఇస్తూనే గ్రామీణ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు కావాల్సిన అన్ని చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. పెండిరగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు కావాల్సిన నిధులను ప్రతిపాదిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సభలో ఆర్థిక మంత్రి భట్టివిక్రమార్క మాట్లాడుతూ తెలంగాణ త్యాగమూర్తుల ఆశయాల సాధన కోసం కార్యాచరణతో ముందుకు సాగుతున్నట్లు వెల్లడిరచారు. నూతన ప్రభుత్వం ప్రజల స్థితిగతులను దృష్టిలో ఉంచుకుని ఏయే రంగాలకు ప్రాధాన్యత ఇవ్వాలో వాటికే పెద్దపీట వేసిందన్నారు. దుబారా ఖర్చులు తగ్గించేందుకు కావాల్సిన అన్ని చర్యలు తీసుకున్నామని చెప్పారు. బడ్జెట్‌ వివరాలు ఇలా... 202425 ఆర్థిక సంవత్సరానికి ఓట్‌ అన్‌ అకౌంట్‌ మొత్తం వ్యయం రూ.2,75,891కోట్లుగా నిర్ణయించగా అందులో రెవెన్యూ వ్యయం రూ.2,01,178 కోట్లు ఉండగా, మూలధన వ్యయం రూ.29,669 కోట్లుగా ప్రతిపాదించారు. 202223 ఆర్థిక సంవత్సరం లెక్కల ప్రకారం అప్పటి ప్రభుత్వం రూ.2,04,523 కోట్లను ఖర్చు చేయగా అందులో రెవెన్యూ మిగులు రూ.5,944 కోట్లు వుండగా ద్రవ్యలోటు రూ.32,557గా వున్నట్లు వివరించారు. అదేవిధంగా 202324లో చేసిన మొత్తం అంచనా వ్యయం రూ.2,24,625 కోట్లుగా ఉంది. రెవెన్యూ వ్యయం రూ.1,69,141 కోట్లు ఉండగా, మూలధనం వ్యయం రూ.24,178 కోట్లుగా ఉన్నట్లు తెలిపారు. సవరించిన అంచనాల ప్రకారం రెవెన్యూ ఖాతాలో మిగులు రూ.9,031 కోట్లు ఉండగా, ద్రవ్యలోటు రూ.33,786 కోట్లుగా ఉందన్నారు. తెలంగాణ తలసరి ఆదాయం ప్రస్తుత ధరల ప్రకారం 202324లో రూ.3,43,297 కోట్లు ఉంటుందనే అంచనా. గత ఏడాది తలసరి ఆదాయం రూ.3,09,912 కోట్లుగా ఉందని వివరించారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ అభయహస్తం పేరుతో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయడంతో పాటు ప్రస్తుత హామీల కొనసాగింపు కోసం రూ.53,196 కోట్ల ప్రతిపాదనలు చేసింది. అయితే ఈ ప్రతిపాదన ఒక ప్రాథమిక అంచనా ప్రకారం మాత్రమే చేశామని, హామీలకు సంబంధించి విధివిధానాలను రూపొందించే పని ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో దానికి అనుగుణంగా పథకాల అమలుకు కావాల్సిన నిధులను కేటాయిస్తామని చెప్పారు. ఎన్నికల సందర్భంగా తాము ఇచ్చిన యువ డిక్లరేషన్‌, రైతు డిక్లరేషన్‌, ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌, బీసీ, మైనార్టీ డిక్లరేషన్‌లను కూడా కచ్చితంగా అమలు చేస్తామని వివరించారు. అలాగే, ఐటీని మరింత బలోపేతం చేసేందుకు కూడా కావాల్సిన అని చర్యలు తీసుకుంటామని, పెట్టుబడిదా రులకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహాయసహకారాలను అందించి వారికి కావాల్సిన అన్ని సదుపాయాలను కల్పిస్తామన్నారు. ఇప్పటికే నూతన ప్రభుత్వం ఇటీవల రూ.40 వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకున్నట్లు వెల్లడిరచారు. పరిశ్రమల శాఖ అభివృద్ధి కోసం రూ.2,543 కోట్లను, ఐటీ శాఖకు రూ.774 కోట్లను ప్రతిపాదించారు. ఐటీ పరిశ్రమను ద్వితియ, తృతియ శ్రేణి నగరాలకు విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. పంచాయతీ రాజ్‌ గ్రామీణాభివృద్ధి కోసం రూ.40,080 కోట్లను ప్రతిపాదిస్తున్నట్లు భట్టి చెప్పారు. రాష్ట్ర నికర స్వంత పన్నుల ఆదాయంలో 11 శాతం నిధులు గ్రామీణ, పట్టణ, స్థానిక సంస్థలకు కేటాయించాలని సిఫార్సు చేసినా గత ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. దశాబ్దకాలంగా రాష్ట్ర ఆర్థిక సంఘం నివేదికను కూడా గత ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టలేదన్నారు. దానిని తమ ప్రభుత్వం అమోదించడమే కాకుండా సభ ముందు పెట్టినట్లు వివరించారు. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని ఇతర పుర ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే నిర్ణయంలో భాగంగా పురపాలక శాఖకు రూ.11,692 కోట్లను ప్రతిపాదిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టు ద్వారా మూసీ అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. దీనికోసం రూ.1000 కోట్లను ప్రతిపాదిస్తున్నామన్నారు. అలాగే, రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకం కింద రూ.5 లక్షలు అందిస్తున్న సహాయాన్ని రూ.10 లక్షలకు పెంచుతూ నిర్ణయించినట్లు తెలిపారు. అసంపూర్తిగా వున్న సూపర్‌ స్పెషాలిటీ, ఇతర అసుపత్రులు, వైద్య కళాశాలలు, నర్సింగ్‌ కళాశాలల నిర్మాణానికి కావాల్సిన నిధులను మంజూరు చేసి వాటిని త్వరలోనే పూర్తి చేస్తుందన్నారు. హైదరాబాద్‌లో వైద్య సేవలను విస్తృత పరిచేందుకు నిమ్స్‌ వైద్యశాలను విస్తరణను పూర్తి చేసేందుకు నిధులను కేటాయించడంతో పాటు పాతబస్తీలోని ఉస్మానియా అసుపత్రి నూతన భవన నిర్మాణాన్ని త్వరలో ప్రారంభిస్తామన్నారు. ఇటీవల 6,956 మంది నర్సింగ్‌ ఆఫీసర్లను నియమకాలను కూడా చేపట్టామన్నారు. ప్రభుత్వ వైద్య శాలలను మరింత పటిష్టపరిచి వాటి నిర్వహణకు కావాల్సిన నిధులను సిబ్బందిని సమకూరుస్తామన్నారు. ప్రస్తుత బడ్జెట్‌లో రూ.11,500 కోట్లను ప్రతిపాదించారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని భట్టి చెప్పారు. ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన విధంగా రుణమాఫీని కచ్చితంగా చేస్తామని, అందుకు కావాల్సిన కార్యాచరణ జరుగుతుందన్నారు. అలాగే తాము ప్రకటించిన విధంగా మద్దతు ధరను ఇవ్వడంతో పాటు రైతు భరోసా కింద రూ.15 వేలను కూడా ఇస్తామని స్పష్టం చేశారు. అర్హులకే ఇచ్చేలా త్వరలోనే విధివిధానాలను రూపొందిస్తామ న్నారు. త్వరలోనే నూతన విత్తన విధానం తీసుకువస్తామన్నారు. పంటల బీమా పథకాన్ని మరింత పటిష్టంగా అమలు చేస్తామని, కౌలు రైతులకు కూడా అందేలా చూస్తామన్నారు. బడ్జెట్‌లో వ్యవసాయ శాఖకు రూ.19,746 కోట్లను ప్రతిపాదించారు. ధరణిలో సమూల మార్పులు తీసుకువచ్చి రైతులకు మేలు జరిగేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. బడ్జెట్‌లో ఎస్సీ సంక్షేమానికి రూ.21,874 కోట్లను, ఎస్టీ సంక్షేమానికి రూ.13,313 కోట్లు, మైనార్టీ సంక్షేమానికి రూ.2,262 కోట్లను, బీసీ సంక్షేమానికి రూ.8 వేల కోట్లను ప్రతిపాదించారు. స్వంత భవనాలు లేని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, గురుకుల పాఠశాలలకు నూతనంగా అన్ని వసతులతో కూడిన భవనాలను నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడిరచారు. అన్ని గురుకుల పాఠశాలల్లో సౌర విద్యుత్‌ను ఏర్పాటు చేసి, అదా అయిన విద్యుత్‌ వినియోగ చార్జీలను తిరిగి అవసరమైన చోట వాటి అభివృద్ధికే కేటాయిస్తామన్నారు. ఎస్సీ గురుకులాల భవన నిర్మాణాలకు రూ.1,000 కోట్లు, ఎస్టీ గురుకులాల భవన నిర్మాణాలకు రూ.250 కోట్ల ప్రతిపాదించారు. గురుకుల పాఠశాలల సొసైటీ ద్వారా నూతనంగా రెండు ఎంబీఏ కళాశాలల ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించినట్లు వెల్లడిరచారు. గురుకుల పాఠశాలలకు బోధనా సిబ్బంది నియామకాలు త్వరలో పూర్తి చేస్తామన్నారు. ఇందిరా క్రాంతి పథం ద్వారా మహిళా స్వయం సహాయక సంఘాలను పెద్దఎత్తున ప్రోత్సహిస్తామని చెప్పారు. అన్ని పాఠశాలల్లో డిజిటల్‌ క్లాస్‌ రూంలను ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని విద్యా కేంద్రంగా మార్చడమే తమ సంకల్పమన్నారు. ఫీజు రీయింబర్స్‌ మెంట్‌తో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ బాలబాలికలకు ప్రస్తుతం అందించే స్కాలర్‌షిప్‌ లను సకాలంలో అందించేం దుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామ న్నారు. ప్రతి మండలానికి అధునాతనమైన సౌకర్యాలతో అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ పబ్లిక్‌ స్కూల్స్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణ పబ్లిక్‌ స్కూల్స్‌ ఏర్పాటు కోసం రూ.500 కోట్లను ఈ బడ్జెట్‌లో ప్రతిపాదిం చారు. కళాశాల స్థాయిలో ఉద్యోగానికి అవసరమైన మేరకు కోర్సులను ప్రవేశపెట్టి పోటీ ప్రపంచంలో తెలంగాణ విద్యార్థులు నెగ్గుకు వచ్చేవిధంగా అన్ని సౌకర్యాలను సమకూరు స్తామన్నారు. రాష్ట్రంలోని 65 ఐటీఐలను ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో ఒక బృహత్తర ప్రణాళిక అమలు చేయబోతు న్నట్లు తెలిపారు. స్కిల్‌ యూనివర్సిటీ ఏర్పాటుపై కూడా ప్రభుత్వం ముందుడుగు వేసిందన్నారు. విశ్వవిద్యాలయాల కల్పనకు రూ.500 కోట్లను ప్రతిపాదించడంతో పాటు విద్యారంగ అభివృద్ధికి మొత్తంగా రూ.21,389 కోట్లను ప్రతిపాదించారు. కాగా, తెలంగాణ ఉద్యమం నీళ్లు, నిధులు, నియామకాల కోసం సాగిందని గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీల నిర్మాణంలో జరిగిన నాణ్యతా లోపం, అవినీతి కార్యక్రమాలు, అనాలోచిత విధానాల అవకతవకలపై విచారణ జరిపిస్తామ న్నారు. కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు న్యాయంగా రావాల్సిన నీటి కేటాయింపులపై పోరాటం చేస్తామన్నారు. ఏఎంఆర్‌ శ్రీశైలం లెప్ట్‌ బ్యాంక్‌ కెనాల్‌, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, నెట్టంపాడు ఎత్తిపోత్తల పథకం, భీమా ఎత్తిపోతల పథకం, కోయిల్‌సాగర్‌, ఎస్‌ఆర్‌ఎస్పీ వరదనీటి కాల్వ, జె చొక్కారావు దేవాదుల, కోమరంభీం, చిన్న కాళేశ్వరం వంటి పథకాలను ముందుగా పూర్తి చేస్తామన్నారు. దీని కోసం నీటి పారుదల శాఖకు ఈ బడ్జెట్‌లో రూ.28,024 కోట్లను కేటాయించారు. తమ ప్రభుత్వం త్వరలోనే 15 వేల కానిస్టేబుళ్ల నియామకాలను చేపడుతుందని తెలిపారు. అలాగే ఇప్పటికే నోటిఫికేషన్‌లో చేర్చినవి కాకుండా అదనంగా 64 గ్రూప్‌1 ఉద్యోగాల భర్తీకి ఉత్తర్వులు జారీ చేశామన్నారు. తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ సరైన రీతిలో పనిచేసేందుకు రూ.40 కోట్లను కేటాయించడంతో పాటు అదనపు సిబ్బందిని కూడా మంజూరు చేసినట్లు వివరించారు. ప్రమాదవశాత్తు మరణించిన వారికి ఈ సామాజిక భద్రత పథకం కింద రూ.5 లక్షల ప్రమాదన బీమా వర్తింప చేస్తూ గత డిసెంబరులో ఉత్తర్వులు జారీ చేసింద న్నారు. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం 24 గంటల ఉచిత విద్యుత్‌ను కొనసాగిస్తామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల విద్యుత్‌ను ఉచితంగా అందచేసేందుకు ఇప్పటికే మంత్రివర్గం నిర్ణయం తీసుకుందన్నారు. ఈ పథకానికి బడ్జెట్‌లో రూ.2,418కోట్లను ప్రతిపాదించగా రాష్ట్రంలోని ట్రాన్స్‌కో డిస్కమ్‌లకు రూ.16,825 కోట్లను ప్రతిపాదించారు. ప్రస్తుతం ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణంలో భాగంగా ఇంటి స్థలం లేని వారికి ఇంటి స్థలం, స్వంత స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షలను కేటాయిస్తామన్నారు. ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇళ్ల చొప్పున మంజూరు చేస్తామని తెలిపారు. ఈ పథకానికి రూ.7,740 కోట్లను ప్రతిపాదించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img