Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

అకడమిక్‌ క్యాలెండర్‌ విడుదల

మొత్తం 213 రోజులు పని దినాలు
కరోనా తగ్గుముఖం పట్టడంతో తెలంగాణలో ఈ నెల 1వ తేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ విద్యా శాఖ అకడమిక్‌ క్యాలెండర్‌ను శనివారం విడుదల చేసింది. 213 పనిదినాలతో కొత్త విద్యా సంవత్సరాన్ని ప్రకటించింది. మొత్తం 213 రోజులు పని దినాలు ఉండగా, ఇందులో 166 రోజుల పాటు ప్రత్యక్ష తరగతులు జరగనున్నాయి. మిగతా 47 రోజుల్లో వర్చువల్‌ మెథడ్‌లో తరగతులు నిర్వహించనున్నారు.పదో తరగతి విద్యార్థులకు 2022, జనవరి 10వ తేదీ నాటికి సిలబస్‌ పూర్తి చేయాలని అధికారులు పేర్కొన్నారు. ఫిబ్రవరి 28 నుంచి ప్రీ ఫైనల్‌ ఎగ్జామ్స్‌ నిర్వహించనున్నట్లు తెలిపారు. మార్చి, ఏప్రిల్‌ మాసాల్లో టెన్త్‌ ఫైనల్‌ ఎగ్జామ్స్‌ నిర్వహిస్తామని వెల్లడిరచారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img