Monday, April 22, 2024
Monday, April 22, 2024

వచ్చే నెల 11న విశాఖకు ప్రధాని మోదీ

విశాఖ రైల్వే స్టేషన్‌ ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన
విశాఖలో భారీ బహిరంగ సభ
పాల్గొననున్న సీఎం జగన్‌, గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌
ప్రధానమంత్రి నరేంద్రమోదీ నవంబరు 11న విశాఖపట్టణంలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వానికి సమాచారం అందింది. ఈ సందర్భంగా రూ. 400 కోట్లతో చేపట్టనున్న విశాఖ రైల్వే స్టేషన్‌ ఆధునికీకరణ పనులకు మోదీ శంకుస్థాపన చేస్తారు. అలాగే, అదే రోజు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేస్తారు. అనంతరం నగరంలో జరగనున్న భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ప్రధాని పర్యటనలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ పాల్గొంటారు. ప్రధాని రాక నేపథ్యంలో చేయాల్సిన ఏర్పాట్లపై కలెక్టర్‌ ఇతర అధికారులు నిన్న సమీక్షించారు. అలాగే, డిసెంబరు 4న తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో జరగనున్న నౌకా దినోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొంటారని సమాచారం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img