Sunday, May 19, 2024
Sunday, May 19, 2024

ఉ.కొరియా నిఘా ఉపగ్రహ ప్రయోగం విఫలం

సియోల్‌: ఉత్తర కొరియా తొలి నిఘా ఉపగ్రహ ప్రయోగం బుధవారం విఫలమైంది. అమెరికా, దక్షిణ కొరియాతో ఉద్రిక్తతల నేపథ్యంలో తమ దేశ సైనిక సామర్థ్యాన్ని పెంచుకోవాలన్న సంకల్పంతో అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌ ఈ ప్రయోగాన్ని చేపట్టారు. అయితే అది విఫలమైంది. తప్పు ఎక్కడ జరిగిందో అన్వేషించి, దానిని సరిదిద్ది ప్రయోగాన్ని తిరిగి చేపడతామని ఉత్తర కొరియా సంకల్పించింది. దౌత్య ప్రతిష్ఠంభన కొనసాగుతున్న వేళ వాషింగ్టన్‌, సియోల్‌పై మరింత ఒత్తిడి పెంచేందుకు నడుం బిగించింది. తాజా ప్రయోగం విఫలం కావడంతో ఉపగ్రహ శకలాలు తమ భూభాగాల్లో పడతాయని భయపడిన దక్షిణ కొరియా, జపాన్‌ దేశాలు ప్రయోగం జరిగిన ప్రాంతానికి దగ్గరగా ఉన్న క్షేత్రాల్లోని తమ పౌరులను అప్రమత్తం చేశాయి. సియోల్‌… ప్రజలను స్పీకర్లలో, ఫోన్‌ సందేశాల ద్వారా హెచ్చరించింది. జపాన్‌ ఒకినావాలో క్షిపణి హెచ్చరిక వ్యవస్థను సిద్ధం చేసింది. ఈ ప్రాంతం ఉత్తరకొరియా రాకెట్‌ గమన మార్గంలో ఉండటంతో ఈ చర్యలు తీసుకొంది. ప్రజలను భవనాలు, అండర్‌గ్రౌండ్‌ల్లోకి వెళ్లమని సూచించింది. ఉపగ్రహాన్ని తీసుకెళుతున్న రాకెట్‌ మొదటి, రెండో దశలలో థ్రస్ట్‌ను కోల్పోయిందని ఉత్తర కొరియా మీడియా పేర్కొంది. ఉపగ్రహ శకలాలు కొరియా ద్వీపకల్పంలోని ఉత్తరం వైపు సముద్రంలో పడిపోయాయని తెలిపింది. ఉదయం 6.37 గంటలకు సోహే ఉపగ్ర ప్రయోగ కేంద్రం నుంచి మల్లిగ్యాంగ్‌1 ఉపగ్రహంతో కూడిన చోల్లిమా1 రాకెట్‌ను ప్రయోగించినట్లు కేసీఎన్‌ఏ వార్తా సంస్థ వెల్లడిరచింది.
ఐరాస, అమెరికా ఖండన : ఉత్తర కొరియా ఉపగ్రహ ప్రయోగాన్ని ఐక్య రాజ్య సమితి (ఐరాస) ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్‌ తీవ్రంగా ఖండిరచారు. ఈ మేరకు ప్రధాన కార్యదర్శికి అధికార ప్రతినిధి స్టిఫనె దుజారిక్‌ ఒక ప్రకటనలో తెలిపారు. బాలిస్టిస్‌ మిసైల్‌ టెక్నాలజీని వినియోగించి ప్యాంగ్యాంగ్‌ ఎలాంటి ప్రయోగాలు చేపట్టినాగానీ అది భద్రతా మండలి తీర్మానాన్ని ఉల్లంఘించడమే అవుతుందని గుటెర్రస్‌ పేర్కొన్నట్లు డురాజిక్‌ వెల్లడిరచారు. మరోవైపు అమెరికా కూడా ఉత్తర కొరియా ప్రయోగాన్ని ఖండిరచింది. ఐరాస ఆంక్షలకు వ్యతిరేకంగా బాలిస్టిక్‌ క్షిపణి టెక్నాలజీని ఉత్తర కొరియా ఉపయోగించిందని ఆరోపించింది. దీనిపై జాతీయ భద్రతా సలహా మండలి ప్రతినిధి ఆడమ్‌ హోడ్స్‌ స్పందిస్తూ అధ్యక్షుడు జో బైడెన్‌, నేషనల్‌ సెక్యూరిటీ టీమ్‌ అమెరికా మిత్రదేశాలు, భాగస్వాములతో సమన్వయం చేసుకొంటున్నారని వెల్లడిరచారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img