Thursday, May 16, 2024
Thursday, May 16, 2024

ఘనంగా జరిగిన 138వ మే డే దినోత్సవ వేడుకలు

సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి మధు

విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణంలో సిపిఐ ఆధ్వర్యంలో 138వ మే డే కార్మిక దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమం సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి మధు ముఖ్య అతిథి ఆధ్వర్యంలో జరిగాయి.. తదుపరి జెండా ఆవిష్కరణ గావించారు. అనంతరం మధు మాట్లాడుతూ 18 గంటల పని దినాన్ని కార్మికులు వ్యతిరేకిస్తూ ఎనిమిది గంటల పని దినముగా ప్రకటించాలని, తెలిపారు ఎన్నో పోరాటాలు ఉద్యమాలు చేయడం జరిగిందన్నారు. అంతేకాకుండా ఎంతోమంది ప్రాణత్యాగం చేయడం కూడా జరిగిందని వారి పోరాటాలు ఫలితమే నేడు మేడేగా కార్మికుల దినోత్సవం గా జరుపుకుంటున్నామని తెలిపారు. భారత కమ్యూనిస్టు పార్టీ నిరంతరం ప్రజల సమస్యల కోసం ప్రజల పక్షాన అండగా నిలబడి ఎన్నో ఉద్యమాలు పోరాటాలు చేసిన ఘనత మన భారత కమ్యూనిస్టు పార్టీకి ఉందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి రవికుమార్, సహాయ కార్యదర్శి రమణ, చేనేత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటనారాయణ, జిల్లా అధ్యక్షులు లక్ష్మీనారాయణ, జిల్లా గౌరవాధ్యక్షులు వెంకటస్వామి, ఏఐవైఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు రాజా, నాయకులు శ్రీధర్, సురేష్, శ్రీనివాసులు, బాల రంగయ్య, ఆదినారాయణ, శ్రీనివాసులు, రామాంజనేయులు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
సిఐటియు ఆధ్వర్యంలో మేడే వేడుకలు:: పట్టణములోని సీఐటీయూ ఆధ్వర్యంలో మేడే వేడుకలు అత్యంత వైభవంగా జరుపుకున్నారు. ప్రజా సంఘాల నాయకులు కార్మికులు, స్థానిక సిఐటియు కార్యాలయం వద్ద నుండి కాలేజీ సర్కిల్, కళాజ్యోతి ,పీఆర్టీ, అంజుమాన్ సర్కిల్ మీదుగా పాత మున్సిపల్ కార్పొరేషన్ వరకు ర్యాలీ నిర్వహించి, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శ్రామిక మహిళా ఉమ్మడి జిల్లా కన్వీనర్ దిల్హాద్ పాల్గొని జెండా ఆవిష్కరించారు. అనంతరం దిల్హాద్ మే డే యొక్క ప్రాధాన్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు అధ్యక్ష, కార్యదర్శులు ఆదినారాయణ, ఆయుబ్ ఖాన్ తో పాటు పెద్దన్న,, ఎస్హెచ్ భాష, మారుతి, బాలాజీ, సే క్షావలి, మున్సిపల్ కార్మిక సంఘం అధ్యక్ష, కార్యదర్శులు బాబు, ముకుందా, పుల్లన్న, ప్రసాద్, మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు,, కార్మికులు,, అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు సరస్వతి, చంద్రకళ,సెక్టార్ లీడర్స్, ఆటో యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు..

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img