Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

మూల్యాంకనం విధుల నుంచి మినహాయింపునివ్వాలి: ఎస్ టి యు.

విశాలాంధ్ర,ఎన్ పి కుంట: దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న ఉపాధ్యాయులను, చంటి బిడ్డ తల్లులను మూల్యాంకనం విధులనుండి మినహాయింపు ఇవ్వాలని ఎస్ టి యు జిల్లా కార్యదర్శి హరి ప్రసాద్ రెడ్డి ఎస్ టీ యు సంఘం నాయకులు పేర్కొన్నారు. గురువారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎస్ టి యు ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ టీ యు జిల్లా అధ్యక్షులు ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ డయాలసిస్ తో పాటు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న ఉపాధ్యాయులను, ఉదయం నుండి సాయంకాలం వరకు కూర్చోవడానికి వీలు కానీ వెన్ను నొప్పితో బాధపడుతున్న ఉపాధ్యాయులను,చంటి బిడ్డల తల్లులను మినహాయింపు ఇవ్వాలన్నారు.ఓపెన్ హార్ట్ సర్జరీ మరియు గుండె వ్యాధులతో బాధపడుతున్న ఉపాధ్యాయులను,న్యూరో సర్జరీ తో బాధపడుతున్న ఉపాధ్యాయులను,పదవీ విరమణకు దగ్గర్లో ఉన్న ఉపాధ్యాయులను మూల్యాంకనం విధులకు దూరంగా ఉంచాలన్నారు. జిల్లా కేంద్రానికి దూరంగా పనిచేస్తూ అక్కడే నివాసం ఉంటున్న మహిళా ఉపాధ్యాయునీయులను, ప్రమోషన్ పొంది మూడు సంవత్సరాలు పూర్తికాని స్కూల్ అసిస్టెంట్లకు స్పాట్ వాల్యూషన్ విధులు నుండి మినహాయింపు కల్పించాలని డిమాండ్ చేశారు. జిల్లా గౌరవాధ్యక్షులు రామాంజులు మాట్లాడుతూ మూల్యాంకన కేంద్రాలలో కనీస వసతులైన బల్లలు, కూర్చీలు, ఎండ తీవ్రతను దృష్ట్యా కూలర్స్, ఫ్యాన్స్, కూల్ వాటర్స్ ,మహిళలకు, పురుషులకు వేరు వేరు వాష్ రూమ్స్ లు తదితర కనీస సౌకర్యాలు కల్పించాలని,ప్రస్తుతం రంజాన్ మాసంలో ముస్లిం ఉపా ధ్యాయులకు, పదో తరగతి స్పాట్ వాల్యుయేషన్ సమయంలో వారికి అవసరమైన సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.జిల్లా కౌన్సిలర్ రమణ నాయక్ మాట్లాడుతూ గత సంవత్సరం పదవ తరగతి మూల్యాంకన విధులలో పనిచేసిన కొంతమంది ఉపాధ్యాయులకు ఇంతవరకు రెమ్యూనిరేషన్ అమౌంట్ లక్షలలో రావావలసి ఉందని దీనిపై తగిన చర్యలు తీసుకొని వెంటనే వారి మూల్యాంకన అమౌంట్ ను వారి వ్యక్తిగత ఖాతాలో జమ అయ్యేలా తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో ఎస్ టి యు నాయకులు సందీప్ కుమార్, షరీఫ్, షఫీ, రమణయ్య, రహీమ్, ముషీర్ అహ్మద్,మంజు భార్గవి, వహీదా, జయశ్రీ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img