Tuesday, May 21, 2024
Tuesday, May 21, 2024

చేనేత పరిశ్రమను కాపాడుకోవాలంటే ఓటు హక్కును తప్పక వినియోగించుకోండి..

సిపిఐ, సిపిఎం నాయకులు
విశాలాంధ్ర ధర్మవరం:: ధర్మవరంలో చేనేత పరిశ్రమలు కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరూ ఓటు హక్కును తప్పక వినియోగించుకోవాలని ఏపీ చేనేత కార్మిక సంఘం సిపిఎం, సిపిఐ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని సిపిఎం కార్యాలయంలో విలేకరులతో సిపిమ్, ధర్మవరం నియోజకవర్గ సిపిఐ కార్యదర్శి మధు, సిపిఎం నాయకులు జంగాలపల్లి పెద్దన్న, చేనేత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటనారాయణ, జిల్లా అధ్యక్షులు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ నేడు చేనేత పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోయిందని చేనేత కార్మికులకు కనీస వేతనము లేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చిందని తెలిపారు. అంతేకాకుండా చేనేత కార్మికులకు గిట్టుబాటు ధర లేకపోవడంతో అప్పుల పాలై ఆత్మహత్యలకు పాల్పడుతూ మరోపక్క భవన కార్మికులుగా ఆటో కార్మికులుగా ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్లడం జరుగుతుందని తెలిపారు. గత ఐదు సంవత్సరాలుగా చేనేత పరిశ్రమలు కుదురుకోవడానికి పవర్ లూమ్స్ ధర్మవరం జోన్లోకి రావడం వల్ల ఇలాంటి పరిస్థితి ఏర్పడడం దారుణమని తెలిపారు. ఇప్పటికే ఒకపక్క అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ అనేక రూపాల్లో సంక్షేమాలు అభివృద్ధిలో మాట్లాడుకుంటున్నారు తప్ప, చేనేత కార్మికుల్ని ఏ విధంగా కాపాడాలని ఏ ఒక్కరు కూడా మాట్లాడే పరిస్థితి కనపడటం లేదని తెలిపారు. కావున ఈనెల 13వ తేదీన ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌరవాధ్యక్షులు వెంకటస్వామి, సిపిఐ పట్టణ కార్యదర్శి రవి కుమార్, సహాయ కార్యదర్శి రమణ, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img