Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

వైద్య ఆరోగ్య ఉద్యోగుల సమస్యల పట్ల ఉదాసీనం వద్దు

రాష్ట్ర అధ్యక్షుడు ఆస్కర రావు
విశాలాంధ్ర- అనంతపురం వైద్యం
: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ హెల్త్ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గొంతి ఆస్కర రావు, ప్రధాన కార్యదర్శి యస్ బాబా సాహెబ్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. వీరబ్బాయి ని గురువారం కలసి శుభాకాంక్షలు తెలిపారు, రాష్ట్ర సంఘం నూతన సంవత్సర డైరీ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇటీవల తుమ్మలపల్లి కళాక్షేత్రం విజయవాడ నందు జరిగిన రాష్ట్ర సర్వసభ్య సమావేశం తీర్మానాల మేరకు క్షేత్రస్థాయి సిబ్బందికి ఎఫ్.అర్.యస్ బయోమెట్రిక్ హాజరు విధానం రద్దు చేసి, విపరీతమైన యాప్ లను తగ్గించాలని, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ తో పాటు అనేక సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయని చేసిన తీర్మానాల మేర వెంటనే ప్రభుత్వం జాయింట్ మీటింగ్ నిర్వహించి పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి యస్ ఎండీ షఫీ, రాష్ట్ర నిర్వాహక కార్యదర్శి నాగ మనెమ్మ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు గోపి, కార్యదర్శి రామూ నాయక్, జిల్లా నాయకులు నూర్ బాషా, వేణు గోపాల్, రామమోహన్, నాగేశ్వరయ్య, సుధాకర్, అశ్వర్త, శ్రీరాములు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img