Friday, May 3, 2024
Friday, May 3, 2024

బీపీ కల్లాలు రోడ్డు పనులు ప్రారంభం

విశాలాంధ్ర -ఆనందపురం : ఆనందపురం మండలం బంటుపల్లి వారి గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న సుమారు 800 మీటర్లు రోడ్డుకు బుధవారం శంకుస్థాపన చేశారు. కాలనీ నుండి చoదకవారికల్లాల వరకు ఈ రోడ్డుకు జిల్లా పరిషత్ నిధుల నుంచి 4 లక్షలు, మండల పరిషత్ నిధుల నుండి 2 లక్షలు పంచాయతీ నుండి రెండు లక్షలు మొత్తంగా 8 లక్షల రూపాయలతో పనులు ప్రారంభించినట్లు మూడు రోజుల్లో రోడ్డు పనులు మొత్తం పూర్తి చేస్తామని సచివాలయం ఇంజనీర్ అసిస్టెంట్ మోహన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కోన పైడిరాజు శ్రీనివాసరావు, సచివాల కన్వీనర్ కోరాడ అచ్యుత రాంబాబు, కోన అప్పలరాజు, శ్రీను,శివ, సత్యనారాయణ, నర్సింగ్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img