Friday, May 3, 2024
Friday, May 3, 2024

మహిళా మార్ట్ లో ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు

విశాలాంధ్ర ఆనందపురం : ఆనందపురం మండలంలో ఏర్పాటుచేసిన మహిళా మార్టు లో ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను అందుబాటులో ఉంచారు
ప్రకృతి వ్యవసాయం విభాగం,స్వయం సహాయక సంఘాలు సహకారంతో ప్రకృతి వ్యవసాయం ఉత్పత్తులు తో వీక్లీ మార్కెట్ ఏర్పాట్టు చేయడం జరిగిందనీ ఏపీఎం నాగభూషణ్ తెలిపారు
ఇందులో భాగంగా ప్రకృతి వ్యవసాయం పద్ధతులు తో చేస్తున్న రైతులు యొక్క ఉత్పత్తులు మహిళా మార్ట్ లో పెట్టడం జరిగిందన్నారు
10 రకాల కూరగాయలు 4 రకాల పప్పుదినుసులు ప్రతీ సోమవారం అందుబాటులో ఉంటయన్నారు
రాసాయినాలు తో పండించిన ఉత్పత్తులు కన్నా ప్రకృతి వ్యవసాయం తో పండించిన పంటకు ఆధారణ బాగుందనీ.రైతులు కి మంచి గిట్టుబాటు ధర కూడా లభిస్తుందన్నారు
ఈ కార్యక్రమంలో వ్యవసాయం విభాగం నుండి (NFA) ఎన్ఎఫ్ఏలు లు, స్వయం సహాయక సంఘం సిబ్బంది,రైతులు, వినియోగదారులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img