Friday, May 3, 2024
Friday, May 3, 2024

సోషల్ మీడియాలో ట్రేడింగ్ లో ఉన్న ఘని కమ్మ- 2

కోటి దాటుతున్న వీక్షకులు.
విశాఖపట్నం : రాజస్థాన్ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక స్థానం ఉంది. వారి వస్త్రధారణ ,కుటుంబ వ్యవస్థ, పెళ్లిళ్లు పండగలు అత్యంత వైభవంగా జరుపుకుంటారు.
ఇక్కడి పరిస్థితులు, పోకడలకు
అద్దం పడుతూ, ఆ ప్రాంతం వారి
సాంప్రదాయాలను విశ్వవ్యాప్తం చేసేందుకు, అద్భుతమైన పాట రూపొందించారు . ఇది ప్రపంచ వ్యాప్తంగా మంచి ప్రాచుర్యం పొందింది.
“ఘని ఖమ్మ 2″సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.
గాయకులు తన శ్రావ్యమైన గాత్రంతో మొత్తం రాజస్థాన్ హృదయాలను గెలుచుకున్నారు . ఈ అద్భుతమైన ప్రాజెక్ట్‌లో, సంగీతం యువ సంగీతదర్శకుడు “సందీప్ దధీచ్” చాలా చక్కగా రూపొందించారు. రాజస్థాన్ అంతటా అతని సంగీత మాయాజాలం యువతను విశేషంగా ఆకట్టుకుంది.
ఈ పాటను రెండు వారాల్లో దాదాపు కోటి మంది వీక్షించారు. వీరి సంఖ్య రానురాను పెరుగుతుంది.
ఏరియా 51 ప్రొడక్షన్స్ లో కిషన్ రాథోడ్ నిర్వహణ లో
ఈ ఆల్బమ్ ఘని ఖమ్మ -2 గా చిత్రీకరించారు. ఘని ఖమ్మ -1 కూడా ఇదే ప్రాచుర్యం పొందింది. ఇందులో నటీ నటులు ఎస్పీ జోధా, పాయల్ శకావత్ ,కిషన్ రాథోర్, పరుల్ చౌహాన్, సోలార్ రేఖ నిషా శర్మ. లిరిక్స్ సందీప్ దదీచ్, జితేంద్ర శివ, సంగీతంసందీప్ దదీచ్. డిస్టప్ ఎస్పి జోధా ,నిర్మాత కిషన్ రాథోర్.
జైపూర్ కి చెందిన కిషన్ రాథోడ్ సినీ పరిశ్రమంలో మంచి పలుకుబడి ఉన్నవారు. గతంలో అనేక చిత్రాలకు నిర్వహణ బాధ్యత చేపట్టారు. జైపూర్ లో పండగలకు పెళ్లిళ్లకు పేదవారికి తన చేతనైన సహాయం అందిస్తుంటారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img