Friday, May 3, 2024
Friday, May 3, 2024

అక్రమ గంజాయి పట్టివేత

రూ. లక్షా 60 వేల విలువ చేసే 80 కేజీల సరకు, 6 మొబైల్ ఫోన్లు స్వాధీనం నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

విశాలాంధ్ర ,ఆనందపురం : ఎస్కార్ట్ రూపంలో రెండు కార్లపై అక్రమంగా గంజాయి తరలిస్తు న్నట్లు పోలీసులకు అందిన సమాచారం మేరకు ఆనందపురం జాతీయ రహదారి బోయపాలెం సిగ్నల్ పాయింట్ వద్ద పోలీ సులు చాకచక్యంగా వ్యవహరించి ట్రాఫిక్ ని నిలుపుదల చేసి అక్రమంగా తరలిస్తున్న 1,60,000 విలువచేసే 80 కేజీల గంజాయిని స్వాధీన పరుచుకున్నారు. ఈ సందర్భంగా డిసిపి -1 సిహెచ్. విజయ్ మణికంఠ, ఏసిపి బి. సునీల్ మంగళవారం రాత్రి స్థానిక విలేకరులకు వివరాలను వెల్లడిస్తూ… ఒరిస్సా రాష్ట్రం కోరా పుట్టి జిల్లా కొట్టంగి గ్రామం నుండి విశాఖ గంజాయిని తరలిస్తున్నట్లు అందిన సమాచారం ఆనందపురం సీఐ టీవీ తిరుపతిరావు ఆధ్వర్యంలో ఎస్సైలు సిబ్బంది. అప్రమత్తమై ఆనందపురం జాతీయ రహదారి బోయపాలెం సిగ్నల్ పాయింట్ వద్ద ట్రాఫిక్ ను నిలుపుదల చేశారు. దీంతో అక్కడకు ఒరిస్సా నుండి రెండు కారులో వస్తున్న వాహనాలు సిగ్నెంట్ పాయింట్ కి చేరుకున్నాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు రెండు కార్లు స్వాధీన పరచుకొని అందులో గల 46 ప్యాకెట్లు లో ఉన్న 1,60,000 విలువచేసే 80 కేజీల గంజాయిని, 6 సెల్ ఫోన్లు, స్వాధీన పరుచుకున్నారు. అంతేకాకుండా ఈ వాహనాల్లో గల నలుగురిని అదుపులోకి తీసుకు న్నారు. వీరిలో ముగ్గురికి ఒరిస్సా కాగా ఒకరిది కేరళ రాష్ట్రం. ఈ గంజాయి ఒరిస్సా రాష్ట్రం నుండి తీసుకుని వచ్చి విశాఖ నుండి కేరళ ఇతర రాష్ట్రాలకు తరలించనున్నట్లు ప్రేమ్ సాయి అనే వ్యక్తితో కాంట్రాక్ట్ లో ఉన్నట్లు తమ ప్రాథమిక దర్యాప్తులో తెలియవచ్చిందని డిసిపి 1 విజయ్ మణికంఠ తెలియజేశారు. గంజాయి అక్రమ రవాణా చేస్తున్నట్లు అందిన సమాచారం మేరకు బోయపాలెం వద్ద సిగ్నల్ పాయింట్ ని ఆపివేసి ట్రాఫిక్ ని నిలుపుదల చేసి చాక చక్యంగా వివరించి గంజాయిని పట్టుకున్న ఆ సిబ్బందిని డీసీపి అభినందిం చారు. ఈ సందర్భంగా విశాఖ నార్త్ ఏసిపి సునీల్, స్థానిక సీఐ టీవీ . తిరుపతిరావు, ఎస్సైలు, గంట్యాడ.సంతోష్, పందిరి.శివ, పోలీస్ సిబ్బంది ఉన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img