Friday, May 3, 2024
Friday, May 3, 2024

మతాలు మారేవారికి పార్టీలో ప్రాధాన్య ఇస్తున్న కాంగ్రెస్ నాయకులు


కాంగ్రెస్ టికెట్ విషయంలో సీనియర్ల జలక్ ఇచ్చిన అధిష్టానం.
భీమిలి టిక్కెట్ బయటి వారికి కేటాయించడం పై ఆగ్రహం

విశాలాంధ్ర -పద్మనాభం : అసలు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుందో తెలియడం లేదని, సీనియర్లను సంప్రదించకుండా, కనీసం ఒక్క మాట కూడా చెప్పకుండా టికెట్ లు కేటాయించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అసలు మతాలు మారేవారికి వాళ్ల మతానికి అనుకూలంగా ఉండే నాయకులకే టికెట్లు కేటాయించడం చాలా దౌర్భాగ్యం అని తల్లి లాంటి అధిష్టానం ఇలా చేస్తే ఎవరితో చెప్పుకుంటామని సీనియర్ లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పార్టీని బలోపేతం చేయడానికి గత కొద్ది కాలంగా అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నామని,సీటు ఆశించి కాంగ్రెస్ పార్టీలో పాతతరం వారినందరినీ కలుపుకొని వెళుతున్న సమయంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల పార్టీ పట్ల నమ్మకం పోతుందని వాపోతున్నారు. ఈమధ్యనే పార్టీ లోకి వచ్చిన కొత్త వ్యక్తులకు సీటు కేటాయించడం చాలా దురదృష్టకరమని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తాజాగా మంగళవారం రాత్రి ప్రకటించిన జాబితా లో సీనియర్లకు మొండిచేయి చూపించింది. ఎన్నో ఏళ్లగా అనుభవం ఉన్న రాజకీయ నాయకులతో కాంగ్రెస్ పార్టీ లో ఉన్నప్పటికీ కూడా ఎవరో ముక్కు మొఖం తెలియని కొత్త వ్యక్తికి భీమిలి సీటు కేటాయించడంపై సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటూ పార్టీ బలోపేతం కోసం కృషి చేసిన నాయకులను మర్చిపోవడం చాలా దౌర్భాగ్యమని సీనియర్ వాపోతున్నారు ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఏ ఒక్కరితోని పరిచయం లేని వ్యక్తికి సీటు కేటాయించడం ఏంటని అలాగే వారికి పార్టీలో ముఖ్యంగా ప్రాధాన్యత ఇవ్వడం అంతుపట్టలేని విషయంగా పార్టీలో వాదనైతే బలంగా వినిపిస్తుంది. అధిష్టానం ఆశావాహుల నమ్మకం పై నీళ్లు జల్లిందని , సీనియర్లను నమ్మించి బలి పశువులుగా వాడుకున్నారని ఇ న్నాళ్ళుగా పార్టీలో ఉంటున్న సీనియర్లకు జలక్ ఇవ్వడం ఏంటని అధిష్టానాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రశ్నిస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img