Tuesday, May 28, 2024
Tuesday, May 28, 2024

గృహ సారథులకు కిట్లు అందజేత

విశాలాంధ్ర,సీతానగరం: మండలంలోని 35గ్రామ పంచాయతీలో నియమించిన గృహ సారథులకు వైఎస్సార్సీపీ అందజేసిన కిట్లును పంపిణి చేస్తున్నట్లు మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు బొంగు చిట్టిరాజు, మండల కన్వీనర్ యూ. సురేష్, ఎంపిపి ప్రతినిధి బలగ శ్రీరాములు నాయుడు, జెడ్పీటీసీ బాబ్జిలు తెలిపారు. మంగళ వారం స్తానిక పెదబోగిలి గ్రామ పంచాయతీలో గృహసారదులకి కిట్లు పంపిణి ప్రారంభం చేశారు. ఈనెల ఏడు నుండి ప్రతీగృహంలో, సెల్ ఫోన్లో అంటించవలిసిన స్టిక్కర్లు తదితర సామాగ్రిని గృహ సారదులకు అందజేసారు. మంగళవారం పెదబోగిలి, చినబోగిలి, కాసాపేట, లచ్చయ్యపేట, బక్కుపేట, తామరకండి, బగ్గందొరవలస, గెడ్డలుప్పి కొత్తవలస, బల్లకృష్ణాపురం గ్రామాల్లో గృహసారదులకు కిట్లు పంపిణి చేశామని తెలిపారు. ఈకార్యక్రమంలో మండల నాయకులు పోలఈశ్వర నారాయణ, ఆర్వీ పార్థసారథి, తెంటు వెంకట అప్పలనాయుడు, రత్నాకర్,నడిమింటి రామకృష్ణ,అంబటి కృష్ణంనాయుడు, తిరుపతి రావు,శివ,శ్రీకాంత్,సర్పంచులు శ్రీనివాస రావు,మహేష్, సత్యం మాస్టారూ, కృష్ణ, అప్పారావు , అప్పలనాయుడు, నారాయణ రావు,ఎంపీటీసీలు కిరణ్,సూర్యనారాయణ,సింహాచలం,శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img