Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

అంటరానితనం, వివక్ష వంటి సంఘటనలు జిల్లాలో జరగరాదు

జిల్లా కలెక్టర్, ఎస్పీలు
విశాలాంధ్ర,పార్వతీపురం: పార్వతీపురం మన్యం జిల్లా పరిదిలో అంటరానితనం, వివక్షవంటి సంఘటనలు జరిగితే వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టరు నిశాంత్ కుమార్ , జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడులు తెలిపారు. బుధవారం జిల్లా కలెక్టరు కార్యాలయ సమావేశమందిరంలో జిల్లా కలెక్టరు అధ్యక్షతన జిల్లా విజిలెన్స్ అండ్ మోనిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు.ఈసమావేశంలో జిల్లా కలెక్టరు నిశాంత్ కుమార్ మాట్లాడుతూ అంటరానితనం, అత్యాచారం, దాడులకు గురయిన బాధితులకు సత్వరన్యాయం, పరిహారం అందించాలన్నారు. పరిహారం పెండింగుగల కేసుల వివరాలను తెలుసుకున్నారు. జిల్లావిజిలెన్స్ అండ్ మోనిటరింగ్ కమిటీ ఏర్పాటైన నాటి నుండి నమోదైన పదికేసుల ప్రస్తుత పరిస్థితిపై, కేసులవారీగా సమీక్ష నిర్వహించారు. కేసులనమోదులో జాప్యం ఉండకూడదని, కేసునమోదుకు అవసరమైన ధృవపత్రాలు వెంటనే భాదితులకు అందించాలని అధికారులను ఆదేశించారు. డివిజినల్ స్థాయి సమావేశాలు నిర్వహించి కేసులపై సమీక్ష నిర్వహించాలన్నారు. అంటరానితనంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, కమిటీసభ్యులు ప్రజలతో మాట్లాడి వారికి సమస్యలు ఉంటే తెలుసుకోవాలన్నారు. పెండింగులో గల కేసుల వారీ వివరాలు, బాదితులకు అందించిన పరిహారం పై సమీక్షించారు.
జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు వి.విద్యాసాగర్ నాయుడు మాట్లాడుతూ జిల్లాలో నమోదైన కేసులపై త్వరితగతిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. నమోదైన పది కేసులలో తొమ్మిది విచారణ దశలోఉండగా, ఒక కేసు కోర్టులో ట్రైల్ దశలో ఉన్నదని తెలిపారు. బాధితులకు కావలసిన సర్టిఫికెట్స్ వెంటనే అందిస్తున్నామన్నారు. కేసు నమోదైన పిదప ఏదైనా కోర్టులోనే తేల్చుకోవాలని ఆయన సూచించారు. ఈసమావేశంలో సంయుక్త కలెక్టరు ఒ. ఆనంద్, సబ్ కలెక్టరు నూరుల్ కమర్, జిల్లారెవిన్యూ అధికారి జె. వెంకటరావు, అదనపు ఎస్పీ డా. ఒ. దిలీప్ కిరణ్, సబ్ డివిజినల్ పోలీసు అదికారులు సుభాష్, కృష్ణారావు సివిల్ సప్లయి జిల్లా మేనేజరు ఎం. దేవుల నాయక్, జిల్లా పశుసంవర్థక అధికారి ఈశ్వరరావు, జిల్లా అగ్నిమాపకఅదికారి కె.శ్రీనుబాబు, కమిటీసభ్యులు గునగంజి చంద్రయ్య, పిరపాక శ్రీనివాసరావు, లక్మీకుమారి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img