Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

బోయ/వాల్మీకి, బెంతు ఒరియా కులాలను గిరిజన జాబితాలో చేర్చాలన్న తీర్మానాన్ని ఉపసంహరించుకోవాలి

విశాలాంధ్ర,పార్వతీపురం: బోయ/వాల్మీకి, బెంతు ఒరియాలను గిరిజన తెగల జాబితాలో చేర్చాలని రాష్ట్ర అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని పలువురు ఆదివాసీ/గిరిజన ,రైతు, రైతుకూలీ, వ్యవసాయ కార్మిక, వామపక్షాల నాయకులు డిమాండ్ చేశారు.శుక్రవారం పార్వతీపురంలోని గిరిజన సామాజిక భవనంలో జిల్లాసదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో గిరిజన సంఘాలకు చెందిన కడ్రక వెంకటస్వామి, జన్నిముత్యాలు, పాలక రంజిత్ కుమార్ , సీపీఐ జిల్లా కార్యదర్శి కె. మన్మధరావు గిరిజన సంక్షేమ సంఘం కార్యదర్శి తాడంగి సాయిబాబు, గిరిజన ఐక్యవేదిక నాయకులు బిడ్డిక తమ్మయ్య ,అఖిల భారత రైతుకూలీసంఘం నాయకులు బొత్స నర్సింగరావు, గిరిజనసంఘం నాయకులు కడ్రక రామాస్వామి, రైతుకూలీసంఘం సంఘం(ఆంద్రప్రదేశ్) ఊయక ముత్యాలు, పి.శ్రీనునాయుడు, సీపీఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు,లిబరేషన్ నాయకులు సంగం తదితరులు పాల్గొని మాట్లాడుతూ శ్రీకాకుళం గిరిజన సాయుధ రైతాంగ పోరాటంద్వారా ఐటీడీఏలు‌ , గిరిజన సహకార సంఘాలను,1/7౦ జీవో 3 లాంటివిసాధించుకొన్నామని తెలిపారు.అదే పోరాటస్పూర్తితో ఉద్యమిద్దమని పిలుపునిచ్చారు. రాజకీయ ప్రయోజనాల కోసం వైసీపీ, తెలుగుదేశం పార్టీలు కేంద్ర బీజేపీ ప్రభుత్వంతో కుమ్మక్కై గిరిజన/ఆదివాసీలకు తీవ్రమైన అన్యాయం చేస్తున్నాయన్నారు. అడవుల నుండి ఆదివాసీలను దూరంచేసి అడవుల్లో ఖనిజసంపదను కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పే కుట్రలను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. గిరిజన జేఏసీ నాయకులపై నిర్భంధం, అరెస్టులను సదస్సు తీవ్రంగా ఖండించింది. గిరిజన జేఏసీ పోరాటాలకు సంఘీభావం ప్రకటించింది. గిరిజన ప్రజలకు నష్టం చేసే అసెంబ్లీ తీర్మానాన్ని ఉపసంహరించుకోవాలని అందరూ కలిసి వచ్చే అన్ని శక్తులను కలుపుకుని ముందుకు సాగాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. గిరిజన జేఏసీ నాయకత్వం తో సంప్రదింపులు జరిపి ఐక్యంగా పోరాటాన్ని ముందుకు తీసుకుపోవాలని నేతలు పిలుపునిచ్చారు.ఈకార్యక్రమంలోవారితో పాటు నాయకులు సీహెచ్ గణేష్, ఊయక గంగరాజు, ఉర్లక నాగార్జున, చందు ,జనార్దన్, మహేష్, సోమేశ్, బాస్కర్రావు , విశ్వేశ్వరరావు ,రాయల సీతయ్య తదితర ఆదివాసీలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img