Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

యువత చేతుల్లోనే దేశ భవిష్యత్తు

రాజాం జి.ఎం.ఆర్‌. ఐటీ విద్యార్థులతో కలెక్టర్‌ సూర్యకుమారి ముఖాముఖి
17 ఏళ్లు నిండిన వారంతా తప్పకుండా ఓటు నమోదు చేసుకోవాలని హితవు

విశాలాంధ్ర విజయనగరం – భారతదేశ బంగారు భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతను కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్‌ ఎ. సూర్యకుమారి పేర్కొన్నారు. 17 ఏళ్లు నిండిన యువతీ, యువకులు ప్రతి ఒక్కరూ తప్పకుండా ఓటు నమోదు చేసుకోవాలని సూచించారు. రాజాం జి.ఎం.ఆర్‌. ఐటీ కళాశాలలో శనివారం ఏర్పాటు చేసిన స్వీప్‌ (సిస్టమాటిక్‌ ఓటర్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ఎలోక్టరాల్‌ పార్టిసిపేషన్‌) సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు ఆవశ్యకతను తెలుసుకోవాలని పేర్కొన్నారు. సామాజిక అంశాలపై అవగాహన కలిగి ఉండాలని, సగటు పౌరుడిగా తమ ప్రాథమిక కర్తవ్యాలను నిర్వర్తించాలని హితవు పలికారు.ఓటు హక్కును సక్రమంగా వినియోగించటం ద్వారా మెరుగైన సమాజ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఓటును ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్ముకోవద్దని యువతను కలెక్టర్‌ హెచ్చరించారు. ఓటు విలువను తెలుసుకోవాలని, భావితరాల వారికి తెలియజేయాలని చెప్పారు. కళాశాల యువత సౌలభ్యం కొరకు స్థానికంగా బి.ఎల్‌.వో.ను అందుబాటులో ఉంచుతామని కలెక్టర్‌ ఈ సందర్భంగా చెప్పారు.
యువత ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకోవాలి
విద్యార్థులతో కలెక్టర్‌ ముఖాముఖి
యువత ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకోవాలని వాటి సాధనకు అహర్నిశలూ శ్రమించాలని కలెక్టర్‌ సూర్యకుమారి సూచించారు. ఓటు నమోదు ప్రక్రియపై అవగాహన కల్పిస్తూ జి.ఎం.ఆర్‌. ఐటీ కళాశాల విద్యార్థులతో కలెక్టర్‌ ముఖాముఖి నిర్వహించారు. ఈ క్రమంలో తన జీవిత విశేషాలను విద్యార్థులతో పంచుకున్నారు. విద్యార్థి జీవితానికి.. ఉద్యోగ జీవితానికి ఉన్న తేడాను విద్యార్థులకు వివరించారు. తను ఈ స్థాయికి చేరుకునే క్రమంలో ఎదురైన పరిస్థితులు ఎదుర్కొన్న తీరును వివరించారు. ప్రస్తుత సమాజంలో జరిగే అవినీతికి లంచం తీసుకొనే వారు ఎలా అయితే బాధ్యులు అవుతారో.. లంచం ఇచ్చే వారు కూడా అంతే బాధ్యులు అవుతారని ఒక విద్యార్థి అడిగిన ప్రశ్నకు కలెక్టర్‌ బదులిచ్చారు. ప్రస్తుతం అమలవుతున్న పథకాలు, అభివృద్ధి పనులు, ఇతర అంశాలపై విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు కలెక్టర్‌ కూలంకషంగా సమాధానాలు ఇచ్చారు.సమావేశంలో చీపురుపల్లి ఆర్డీవో అప్పారావు, ఎస్‌.డి. సి. పద్మావతి, జి.ఎం.ఆర్‌. ఐటీ డైరెక్టర్‌ జె. గిరీష్‌, ప్రిన్సిపాల్‌ ఎస్‌.ఎల్‌.ఆర్‌.వి.ఎస్‌. ప్రసాద్‌ స్థానిక రెవెన్యూ అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img