Friday, May 3, 2024
Friday, May 3, 2024

నవధాన్యాలుసాగు.. నేలతల్లికి బాగు…

ప్రకృతి వ్యవసాయం రీజనల్ అధికారి ప్రకాశ్
విశాలాంధ్ర- పాచిపెంట/సాలూరు: నేటి కాలంలో రైతులు నవధాన్యాలు సాగుపై దృష్టి సారించి అధిక దిగుబడులుసాధించాలని ప్రకృతి వ్యవసాయ రీజనల్ కో ఆర్డినేటర్ కె. ప్రకాశ్ పిలుపు నిచ్చారు.శనివారంనాడు నవధాన్యాలుసాగు-నేలతల్లికి బాగు కార్యక్రమంలో బాగంగా పాచిపెంట, సాలూరు మండలాల్లోని ప్రకృతి వ్యవసాయ సాగుచేస్తున్న పి.కోనవలస, కోటికపెంట, అమ్మవలస, కర్రివలస గ్రామాలను ప్రకాశ్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.ముఖ్యంగా ప్రతీగ్రామంలోనూ నవధాన్య విత్తనాలు కిట్లుతయారీ, పంపిణీ మరియు గ్రౌండింగ్ గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా నవధాన్యాలు సాగువల్ల జరిగే ఉపయోగాలు, ప్రాముఖ్యతను గురించి రైతులకు వివరించారు. అలాగే రైతు భరోసా కేంద్రంల ద్వారా విత్తనాలు కిట్లు పంపిణీ చేయమని, గుళిరాగిపై ప్రత్యేక దృష్టిపెట్టి వీలైనంత వరకు ఎక్కువ మందితో గుళిరాగి వేసేవిధంగా అవగాహణ పెంచడం చేయాలని ప్రకృతి వ్యవసాయ సిబ్బందికి తెలిపారు. రైతుల ప్రకృతి వ్యవసాయ పంటలకు గిట్టుబాటు,దిగుబడి, మార్కెట్ తదితర అంశాలపై సాలూరు, పాచిపెంట మండలాల ప్రకృతి వ్యవసాయ సిబ్బందితో సమీక్ష చేశారు. రైతులు ప్రక్రుతి వ్యవసాయసాగును చేసేందుకు వారిని మరింత అవగాహన పెంచేలా చర్యలు తీసుకోవాలని కోరారు. తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి ప్రకృతి వ్యవసాయం ద్వారా మాత్రమే సాధ్యమని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకృతి వ్యవసాయ పంటల సాగుకు అదిక ప్రాధాన్యత ఇస్తున్న సంగతిని వివరించారు. గిరిజన ప్రాంతాల్లో నూటికి నూరు శాతం మంది ప్రకృతి వ్యవసాయం చేసేలా తగు దృష్టి పెట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ ఇంచార్జి పి.యశోధమ్మ, మండలఇంచార్జిలు కె. బాలక్రిష్ణ, వి.తిరుపతినాయుడు, కె. శ్రీనివాసు, బి.రవణమ్మ, ఐసీఆర్పీలు విజయకుమార్, సురేష్, కుమార్, రమణ, వెంకటరమణతోపాటు రైతులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img