Saturday, May 4, 2024
Saturday, May 4, 2024

మే 13 న వేతనంతో కూడిన సెలవు

విశాలాంధ్ర. విజయనగరం : మే 13 వ తేదిన ఎన్నికల రోజున వేతనంతో కూడిన సెలవు ప్రకటించినట్లు జిల్లా ఉప కార్మిక కమిషనర్ ఎన్.సుబ్రమణ్యం ఒక ప్రకటనలో తెలిపారు. సాదా దుకాణములు మరియు సంస్థలలో పనిచేస్తున్న ఉద్యోగి, కార్మికులకు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వీలుగా ఆరోజున వేతనంతో కూడిన సెలవును ప్రకటించినట్లు తెలిపారు.
ఏదైనా వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక సంస్థ లేదా ఏదైనా ఇతర సంస్థలలో ఉద్యోగం చేస్తున్న ప్రతి వ్యక్తీ, శాసనసభ మరియు లోక్ సభ ఎన్నికలలో ఓటు వేయడానికి అర్హులైన ప్రతి వ్యక్తికి, పోలింగ్ రోజున, తప్పనిసరిగా సెలవు మంజూరు చేయాలని స్పష్టం చేశారు.

     ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 లోని సెక్షన్ 135B (1) ప్రకారం, 

ఏదైనా యజమాని సబ్ సెక్షన్ (1) లేదా సబ్ సెక్షన్ (2) నిబంధనలను ఉల్లంఘిస్తే, అటువంటి యజమాని జరిమానాతో కూడిన శిక్షార్హులవుతారని తెలిపారు.
తేది 13.05.2024 (సోమవారం) పోలింగ్ జరిగే నియోజక వర్గం వెలుపల పనిచేసే రోజు వారీ వేతనం / సాధారణ కార్మికులు కుడా ఓటు వినియోగించు కోవడానికి అర్హులని తెలిపారు. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 లోని సెక్షన్ 135B (1) ప్రకారం పోలింగ్ రోజున అతని / ఆమె కార్యాలయం మూసివేయబడనప్పటికీ, పోలింగ్ రోజున సెలవు మరియు వేతనాలకు అర్హులని పేర్కొన్నారు. ఈ ఆదేశాలను యజమానులు అందరు పాటించి వారి షాపులు మరియు సంస్థలలో పని చేస్తున్న కార్మికులకు ఎన్నిక రోజున సెలవు మంజూరు చేయాలని ఉప కార్మిక కమిషనర్ ఆదేశించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img