Saturday, May 4, 2024
Saturday, May 4, 2024

మీలో ఒక్కడిగా..మీ కోసం వస్తున్నా

ఆలోచించి ఓటు వేయండి..
ఓటర్లకి విజ్జప్తి చేస్తున్న..
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి బొబ్బిలి శ్రీను..
నేడు నామినేషన్ దాఖలు..
విశాలాంధ్ర-విజయనగరం టౌన్ : ‘నేనొక సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చాను. ప్రజల సాధక బాధలను దగ్గరగా చూశాను. మీలో ఒకడిగా మీ కోసం వస్తున్నా. మన యువత భవిష్యత్ కోసం కంకణం కట్టుకుని వస్తున్నా. పార్లమెంట్ లో సామాన్య ప్రజల గొంతు వినిపించాలని పోటీ చేస్తున్నా. విజ్జతతో అలోచించి హస్తం గుర్తుపై ఓటు వేసి నన్ను గెలిపించాలని విజ్జప్తి చేస్తున్నాను..’ అంటూ విజయనగరం పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బొబ్బిలి శ్రీను ప్రజలకు పిలుపునిచ్చారు. మంగళవారం నగరంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీలైన సిపిఐ, సిపిఎం పార్టీల జిల్లా నాయకులతో కలిసి బొబ్బిలి శ్రీను మాట్లాడారు. మొన్నటి వరకు ఈ ప్రాంతానికి ఎంపీగా చేసిన వ్యక్తి ఈ ఐదేళ్లలో 20 శాతం మంది ప్రజలకి కూడా తెలియదని విమర్శించారు. అలాగే ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా పోటీ చేయబోతున్న వ్యక్తి కూడా రేపటి రోజున ప్రజలకు దూరంగానే ఉంటాడనేది ప్రజలు గమనించాలని కోరారు. ఈ ఇద్దరిలో ఎవరికి ఓటు వేసినా అది ప్రత్యక్షంగా, పరోక్షంగా బీజేపీ కే చేరుతుందన్నారు. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలన్నా, రాష్ట్ర అభివృద్ధి జరగాలన్నా, యువతకు ఉపాధి ఉద్యోగాల కల్పన జరగాలన్నా అది కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమి వల్లే సాధ్యమని బొబ్బిలి శ్రీను స్పష్టం చేశారు. ఈ దేశానికి రాహుల్ గాంధీ-ఖర్గే నాయకత్వం అవసరమని, అదేవిదంగా 2004 నుంచి సంక్షేమ అభివృద్ధి పాలనను అందించి రాష్ట్ర రాజకీయ పరిపాలనా ముఖ చిత్రమే మార్చేసిన మహా నేత వైఎస్ రాజ శేఖర్ రెడ్డి ఆశయాల వారసురాలు వైఎస్ షర్మిలా రెడ్డి నాయకత్వం ఈ రాష్ట్ర భవిష్యత్ కి అవసరమని అన్నారు. పార్లమెంట్ లో మన జిల్లా ప్రజా సమస్యలను లేవనేత్తి, వాటి పరిష్కారం కోసం కృషి చేసే దిశగా తనకు ఈ అవకాశం లభించిందని అన్నారు. ఈ జిల్లా ప్రజలు, ముఖ్యంగా యువతకు విద్యా, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు రాలంటే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రాష్ట్రంలో అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా ప్రజలు ఆలోచించాలని, తమ తలరాతలు మార్చుకునే ఓటు అనే ఆయుధం ప్రజల చేతుల్లోనే ఉందని, హస్తం గుర్తు పై ఓటు వేసి ఇండియా కూటమిలోని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తనకు ఓటు వేసి గెలిపించాలని బొబ్బిలి శ్రీను కోరారు. ఈ సందర్బంగా ప్రెస్ మీట్ లో మాట్లాడిన సీపీఐ, సిపిఎం నాయకులు పి కామేశ్వరరావు, సూర్యనారాయణ, ఒమ్మి రమణ తదితరులు బీజేపీ పాలనను దుయ్యబట్టారు. మోదీ ప్రభుత్వం మళ్ళీ వస్తే అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చేసి, ప్రజా స్వామ్యాన్ని కూనీ చేసి, మతం పేరుతో విధ్వంసం చేస్తాడని ద్వజమెత్తారు. దేశ సంపదను కొల్లగొట్టి అదానీ, అంబానీల కాళ్ళ దగ్గర దేశ ప్రజలు మోకరిళ్ళేలా చేశాడని అక్షేపించారు. బడుగు బలహీన వర్గాల భవితవ్యం కాంగ్రెస్ నేత్రంత్వంలోని ఇండియా కూటమి చేతుల్లోనే ఉందని అన్నారు. వామ పక్ష పార్టీలుగా తమ మద్దతు విజయనగరం జిల్లాలో 7 అసెంబ్లీలో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థులతో పాటు, పార్లమెంట్ అభ్యర్థి బొబ్బిలి శ్రీనుకి ఉంటుందన్నారు. అతడి గెలుపు కోసం కృషి చేస్తామని ఈ సందర్బంగా వామ పక్ష పార్టీల నేతలు ప్రకటించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్, వామ పక్ష పార్టీల నేతలు డోల శ్రీనివాస్ రావు, జమ్ము ఆదినారాయణ, శ్రీనివాస్, బుగత అశోక్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img