Friday, May 3, 2024
Friday, May 3, 2024

పార్వతీపురం ఎమ్మెల్యే అలజంగి జోగారావును క్షీరాభిషేకంచేసి ప్రజాభిమానాన్ని చాటుకున్న పి.చాకరపల్లి గ్రామప్రజలు


గుర్రంరథంపై పల్లకిలో ఊరేగించిన గ్రామస్తులు
విశాలాంధ్ర,పార్వతీపురం: నియోజక వర్గంలోని బలిజిపేట మండలంలో 15రోజులక్రితం పార్వతీపురం ఎమ్మెల్యే అలజింగి జోగారావును పల్లకిలో ఊరేగించిన నూకలవాడ గ్రామస్థులు చేసిన కార్యక్రమంను రాష్ట్రస్థాయిలో అందరూ చూసి ఆశ్చర్య పోయారు.మరలానేడు కూడా ఇదే మండలంలోని పి.చాకరపల్లి గ్రామంలో మహిళలు,చిన్నారులు, యువతీ యువకులు, గ్రామస్తులు అంతా కలిసికట్టుగా ఎమ్మెల్యే జోగారావును క్షీరాభిషేకంను పెద్ద ఎత్తున చేసి, గ్రామంలో గుర్రంరథంపై పల్లకీలో కూర్చోబెట్టి జేజేలు పలుకుతూ, పూలుజల్లి ఊరేగింపు నిర్వహించారు. రాజకీయ నాయకులను, ప్రజా ప్రతినిధులను వ్యతిరేకించే నేటిరోజుల్లో…పాలాభిషేకం చేస్తున్న తీరును చూస్తుంటే ప్రజలకు ఎమ్మెల్యే జోగారావు మీదున్న గౌరవం, అభిమానం వెలకట్టలేనిదనీ స్పష్టంగా తెలుస్తోంది.
వివరాల్లోకి వెళితే ఎన్నో దశాబ్దాల నుండి పార్వతీపురం నియోజకవర్గంలో మారుమూల ఉన్న బలిజిపేట మండలం పి.చాకరపల్లి గ్రామానికి సరైన రోడ్డు మార్గంలేదు… చినుకు పడితే ఆగ్రామ ప్రజలు మరియు ఆ చుట్టు ప్రక్కల గ్రామస్తులు పడే కష్టాలు వర్ణనాతీతం..అటువంటి గ్రామప్రజల రోడ్డుకలను సాకారం చేసిన పార్వతీపురంఎమ్మెల్యే అలజంగి జోగారావు రోడ్డు వేయించి శుక్రవారం ఆయన చేతుల మీదుగా ప్రారంభించారు.దీంతో గ్రామప్రజలు పాలాభిషేకంచేసి, గుర్రపు రధంపై ఊరేగించి తమ అభిమాన నాయకుడికి అడగడుగున కృతజ్ఞతలు తెలిపారు.మాగ్రామమంతా ఏకమైవచ్చి మీకు క్షీరాభిషేకంచేసి, పుష్పాభిషేకం చేసి, మాప్రజలందరి బుజస్కందాలపై మోసుకు వెళ్లి అశ్వరదముపై మిమ్ములను గ్రామానికి తోడ్కొనివెళ్లిన మీరు చేసిన మేలు మేము మరువలేమని తెలిపారు.ఏమిచ్చి తీర్చుకోగలం మీరుణం జోగన్న అని వారంతా నినాదాలు చేస్తూ, రానున్న ఎన్నికల్లో గ్రామమంతా కలిసి కట్టుగా ఓటుద్వారా రుణం తీర్చుకునే అవకాశం మాకివ్వాలన్నారు. ఈకార్యక్రమంలో బలిజిపేట మండలంలోని ప్రజా ప్రతినిధులు, అధికారులు, వైఎస్సారసీపీ నాయకులు,సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు,గ్రామస్తులు, ప్రక్క మండల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రోడ్డును సకాలంలో పూర్తి చేసిన గుత్తేదారును ఎమ్మెల్యే జోగారావు అభినందించారు. ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కారం చేయడమే తన ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే జోగారావు తెలిపారు. తనకు ఈరోజున జరిగిన సత్కారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి జరిగిన సత్కారంగా భావిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగ్మోహన్రెడ్డి ఆద్వర్యంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం గత నాలుగేళ్లుగా అమలు చేస్తున్న సంక్షేమపథకాలు, అభివృధ్ధి పనులు వల్లనే ఎంతో ఆనందంగా ఉందన్నారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పన కోసం పెద్దఎత్తున ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img