Friday, April 26, 2024
Friday, April 26, 2024

ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి

కళ్ళాల నుంచే రైతులనుంచి నేరుగా ధాన్యం కొనుగోలు చేయాలి
సీపీఐ పశ్చిమగోదావరి జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు

విశాలాంధ్ర పెంటపాడు : వరి కోతలు పశ్చిమ గోదావరి జిల్లాలో ముమ్మరంగా జరుగుతున్నందున రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి రైతుల నుంచి నేరుగా ధాన్యం కొనుగోలు చేయాలని సీపీఐ పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు డిమాండ్ చేశారు.మంగళవారం భీమారావు రైతు సంఘం నాయకులతో కలిసి పెంటపాడు మండలంలోని ఆకుతీగపాడు గ్రామంలో రైతు భరోసా కేంద్రాలను సందర్శించి రైతుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా భీమారావు మాట్లాడుతూ ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర రూ.1530 చెల్లించి తక్షణమే ధాన్యం కొనుగోలు చేయాలన్నారు.ఈనెల 6 వ తేదీ నుంచే ఆర్బీకేల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి కళ్ళాల వద్దే వరి ధాన్యం కొనుగోలు చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెపుతున్నా క్షేత్ర స్థాయిలో అమలు కావడం లేదన్నారు.ఆర్బీకేల్లో తమకు ఇంకా ధాన్యం కొనుగోలుకు ఎలాంటి అనుమతులు రాలేదని చెపుతున్నారన్నారు.రైతుల కళ్ళాల నుంచే ధాన్యం కొనుగోలు చేస్తున్నామని చెపుతున్న ప్రభుత్వం ఇళ్ళ వద్దకు చేరవేసి ఆరబెట్టిన ధాన్యం కొనుగోలుకే దిక్కులేదని రైతులు వాపోతున్నారన్నారు.తక్షణమే కనీస మద్దతు ధర చెల్లించి కళ్ళాల నుంచే ధాన్యం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని భీమారావు కోరారు.సీపీఐ మండల కార్యదర్శి కళింగ లక్ష్మణరావు, రైతు సంఘం నాయకులు వంక అప్పారావు, రామకృష్ణ,బి.లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img