Monday, December 5, 2022
Monday, December 5, 2022

నాడు నేడు నిధులను స్వాహా చేసిన హెచ్ఎం

విశాలాంధ్ర పెంటపాడు: మండలంలోని యానాలపల్లి గ్రామ పరిధిలో ఉన్న నంబర్ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు గా పనిచేయుచున్న విలియం రత్న రాజు రాష్ట్ర ప్రభుత్వం స్కూల్ మరమ్మత్తుల నిమిత్తం నాడు నేడు పథకం ద్వారా అందజేసిన సొమ్మును నిబంధనలకు వ్యతిరేకంగా బ్యాంకు నుంచి రూ 98 వేల నగదును డ్రా చేసినందుకు గాను జిల్లా విద్యాశాఖ అధికారి రమణ సస్పెండ్ చేసినట్లు పెంటపాడు మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. హెచ్ఎం విలియం గత నెల 21న రూ. 50వేలు, 28న రూ.20వేలు, రూ.28 వేలు మొత్తం రూ. 90వేల నగదును డ్రా చేసినట్లు ఇందుకుగాను ఈయనను సస్పెండ్ చేసినట్లు ఎంఈఓ శ్రీనివాస్ తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img