Friday, April 26, 2024
Friday, April 26, 2024

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట : ఎమ్మెల్యే వాసుబాబు

విశాలాంధ్ర – నిడమర్రు : రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసిందని ఉంగుటూరు శాసనసభ్యులు పుప్పాల శ్రీనివాసరావు(వాసుబాబు) అన్నారు. గురువారం మండల కేంద్రమైన నిడమర్రు జిల్లా పరిషత్‌ హై స్కూల్‌నందు మనబడి నాడునేడు పేజ్‌-1లో భాగంగా రూ. 80 లక్షలు అంచనా వ్యయంతో నిర్మించిన అదనపు తరగతులు ప్రారంభోత్సవం, నాడు నేడు పేజ్‌ -2 లో రూ.25 లక్షలు అంచనా వ్యయంతో నిర్మిస్తున్న అదనపు గదులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, జగన్‌ ప్రభుత్వం పాఠశాలల అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తుందని.. అందుకే మన బడి నాడు నేడు పథకాన్ని తీసుకువచ్చిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సూర్య బలిజ కార్పొరేషన్‌ చైర్మన్‌ శెట్టి అనంతలక్ష్మి, సర్పంచ్‌ పొట్నూరి ఉమామహేశ్వరరావు, ఎంపీపీ ధనుకొండ ఆదిలక్ష్మి, జడ్పిటిసి సభ్యులు కోడే కాశీ ,వెజ్జు వెంకటేశ్వరరావు, హై స్కూల్‌ హెచ్‌ యం యర్రంశెట్టి శేషగిరిరావు, ఎంపీడీవో ప్రకాష్‌, ఎంఈఓ పుచ్చల శేషు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img