Monday, September 26, 2022
Monday, September 26, 2022

జాతీయ స్థాయి సీనియర్ బాస్కెట్ బాల్ పోటీలకు సెయింట్ తెరెసా విద్యార్థినులు

ఏలూరు: జాతీయస్థాయి సీనియర్ బాస్కెట్ బాల్ పోటీలకు సెయింట్ థెరిస్సా కళాశాలకు చెందిన విద్యార్థులు ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా. సిస్టర్ మెర్సీ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.స్థానిక సెయింట్ తెరెసా కళాశాలకు చెందిన విద్యార్థులు టాలీ అనిత, జి. నాగ దేవి లు గత నెల ఆగస్టు 18వ తేదీ నుండి 21వ తేదీ వరకు గుంటూరులో జరిగిన 8వ ఎపి అంతర జిల్లా రాష్ట్రస్థాయి బాస్కెట్ బాల్ పోటీలలో అత్యంత ప్రతిభ కనబరిచారు. అక్టోబర్ 13వ తేదీ నుండి 16వ తేదీ వరకు పాండిచ్చేరిలో జరిగే జాతీయ సీనియర్ స్థాయి ఛాంపియన్ షిప్ పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ తెలియజేశారు.ఈ విద్యార్థినులను కళాశాల వ్యాయామ అధ్యాపకురాలు మేజర్ డాక్టర్ పి ఎం సెలీన్ రోజ్ ,కోచ్ కె.మురళీకృష్ణ, వైస్ ప్రిన్సిపల్ సిస్టర్ రజిత, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ సిస్టర్ సుశీల, అధ్యాపకులు అభినందించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img