Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

కొయ్యలగూడెం ఎస్ఐ గా విష్ణువర్ధన్

కొయ్యలగూడెం : కొయ్యలగూడెం పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ గా జి. జె. విష్ణువర్ధన్ సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఈయన ఇప్పటి వరకు జిల్లా కేంద్రమైన ఏలూరులో ఎస్ఈబి లో విధులు నిర్వర్తించి, బదిలీపై కొయ్యలగూడెం రావడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో ఎటువంటి అవాంఛనీయమైన సంఘటనలు జరిగిన, కోడి పందాలు, పేకాట, వంటి వి నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. మండలంలో ప్రజలకు పోలీస్ సేవలు అందజేయడానికి నిత్యం అందుబాటులో ఉంటామని ఆయన తెలిపారు. ఎ టువంటి ప్రమాదాలు జరిగిన తమకు తెలియచేయాలని ఎస్ ఐ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img