Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ప్రతి రైతుకు న్యాయం జరిగే విధంగా ధాన్యం కొనుగోలు చేస్తాం

విశాలాంధ్ర – పెనుమంట్ర : ప్రతి రైతుకు న్యాయం జరిగే విధంగా ధాన్యం కొనుగోలు చేస్తామని మండల అధ్యక్షులు కర్రి వెంకట నారాయణ రెడ్డి (వాసు) అన్నారు. సోమరాజు ఇల్లిందలపర్రు రైతు భరోసా కేంద్రం వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వాసు మాట్లాడుతూ ప్రతి రైతు వద్దగల ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ఈ విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్న అసత్య ప్రసారాలను నమ్మకండన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన నాటినుండి 21 రోజుల్లో రైతుల ఖాతాలో సొమ్ము జమ అవుతుందని వాసు భరోసా ఇచ్చారు.మండలంలో కొనుగోలు చేసిన ధాన్యాన్ని మండలంలోని రైస్ మిల్లులు వద్దకే పంపించే ఏర్పాట్లు ఆచంట నియోజవర్గ శాసనసభ్యులు చెరుకూడా
శ్రీరంగనాథరాజు ఏర్పాటు చేశారని ,రైతుకు కావలసిన గోను సంచులు ఎప్పుడు రైతు భరోసా కేంద్రాల్లో అందుబాటులో ఉంటాయన్నారు. ఈ సందర్భంగా ధాన్యం ఎగుమతి చేసిన ట్రాక్టర్లను వాసు డ్రైవింగ్ చేయగా జెడ్పిటిసి కర్రి గౌరీ సుభాషిని, ఏఎంసి వెలగల వెంకటరమణ పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. పెనుమంట్ర, మాముడూరు, మార్టేరు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ వెలగల వెంకటరమణ, జెడ్పిటిసి కర్రి గౌరీ సుభాషిని వేణుబాబు, చంటి రాజు, దేవేంద్రుడు, అల్లం భాస్కర్ రెడ్డి, తాసిల్దార్ వర్మ, ఎంపీడీవో పూర్ణ బాబ్జి, మండల వ్యవసాయ అధికారిని జయ దుర్గా మాధురి, రైతులు, కౌవులు రైతులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img