Tuesday, May 7, 2024
Tuesday, May 7, 2024

సీపీసీ పనితీరు మెరుగుదలకు సంకల్పం

అన్ని రంగాల్లో క్రమబద్ధీకరణ
హవానా : కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ క్యూబా (పీసీసీ) సెంట్రల్‌ కమిటీ పని తీరును మెరుగుపరచడానికి సంకల్పించింది. దేశం ఎదుర్కొంటున్న వివిధ ఇబ్బందుల నేపథ్యంలో సవాళ్లకు అనుగుణంగా సృజనాత్మకంగా పోరాడాలని, ప్రతిఘటన స్ఫూర్తిని కొనసాగించాలని పిలుపునిచ్చింది. సమాజంలోని అన్ని రంగాల్లో వ్యవస్థను మరింత క్రమబద్దీకరణ చేసేందుకు అధ్యక్షుడు కానెల్‌ నొక్కి చెప్పారు. ప్రజల శక్తిని బలోపేతం చేయడం, రాజకీయసైద్ధాంతిక అవగాహనను మరింత మెరుగుపరచడం ప్రధాన లక్ష్యాలుగా కన్వెన్షన్‌ ప్యాలెస్‌లో జరిగిన రాజకీయ సంస్థ రెండవ ప్లీనరీ సమావేశాల్లో ప్రసంగించారు. పౌరుల సంక్షేమానికి ఐక్యతను బలోపేతం చేయవలసిన అవసరాన్ని కానెల్‌ నొక్కి చెప్పారు. ప్రతి సమస్యను బాధ్యతగా, మెరుగ్గా చూడాల్సిన అవసరం ఉందని అన్నారు. కష్టాలను అధిగమించే మన సామర్థ్యానికి సవాలుగా పేర్కొన్నారు. క్యూబన్ల నిర్ణయాత్మక పోరాటం విజయవంతంగా కొనసాగుతుందని కానెల్‌ వ్యాఖ్యానించారు. సోషలిజం నిర్మాణంలో ముందుకు సాగడానికి ప్రేరణ పొందవలసిన అవసరం గురించి మాట్లాడారు. కష్టాలను అధిగమించి తప్పిదాలు లేకుండా తెలివితేటలతో, గౌరవంతో రాజ్యాంగ పరిరక్షణలో శక్తితోపాటు విజయం కోసం పోరాడాలని, పనిశైలిని మెరుగుపరడం, మిలిటెన్సీ స్వభావాన్ని పెంపొందించడం, పౌరులతో ఐక్యతను బలోపేతం చేయాలవసిన అవసరాన్ని ఆయన సూచించారు. మెరుగైన దేశాన్ని నిర్మించడం ద్వారా ప్రైవేటు రంగాల మధ్య ఐక్యతను బలోపేతం చేయడంపై ప్రధానంగా కానెల్‌ దృష్టిసారించారు. 20212026 మధ్య కాలంలో క్యూబాలో ప్రజల శక్తిని బలోపేతం చేసే ప్రతిపాదనను ఆమోదించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img