Wednesday, May 1, 2024
Wednesday, May 1, 2024

వచ్చే వారం దిల్లీకి మమత

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వచ్చేవారం దేశ రాజధాని దిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసే అవకాశం ఉందని ఉన్నతస్థాయి వర్గాలు వెల్లడిరచాయి. రాష్ట్రానికి రావలసిన బకాయిలు , బీఎస్‌ఎఫ్‌ అధికార పరిధిని పెంచడం వంటి అంశాలపై మమత ప్రధాని చర్చించే అవకాశం ఉంది. మమతాబెనర్జీ నవంబర్‌ 22న దేశ రాజధానిని సందర్శించి, నవంబర్‌ 25న కోల్‌కతాకు తిరిగి వచ్చే అవకాశం ఉంది. దిల్లీ పర్యటనలో ఆమె ప్రధానితో పాటు ఇతర రాజకీయ పార్టీల నేతలతో కూడా వరుస భేటీలు నిర్వహించే అవకాశం ఉంది. ప్రధానితో చర్చల సందర్భంగా రాష్ట్ర బకాయిలను క్లియర్‌ చేయాలనే ఆమె దీర్ఘకాలిక డిమాండ్‌ను, బిఎస్‌ఎఫ్‌ అధికార పరిధిని పెంచాలనే కేంద్రం నిర్ణయంపై తన అభ్యంతరాన్ని లేవనెత్తనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడిరచాయి. కేంద్రం బీఎస్‌ఎఫ్‌ పరిధిని అంతర్జాతీయ సరిహద్దుకు 15 కి.మీ నుంచి 50 కి.మీ వరకు విస్తరించడాన్ని మమత ఇంతకుముందే వ్యతిరేకించారు. కేంద్రం యొక్క చర్య కేవలం సామాన్య ప్రజలను హింసించడమేనని ఆమె పేర్కొన్నారు. ఈ అంశంపై అభ్యంతరాలను లేవనెత్తుతూ ప్రధాని మోదీకి లేఖ కూడా రాశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img