London Escorts sunderland escorts asyabahis.org www.dumanbet.live www.pinbahiscasino.com sekabet.net olabahisgir.com www.maltcasino.net www.faffbet-giris.com www.asyabahisgo1.com dumanbetyenigiris.com pinbahisgo1.com www.sekabet-giris2.com olabahisgo.com www.maltcasino-giris.com www.faffbet.net betforward1.org betforward.mobi www.1xbet-adres.com 1xbet4iran.com www.romabet1.com www.yasbet2.net 1xirani.com romabet.top 3btforward1.com 1xbet 1xbet-farsi4.com بهترین سایت شرط بندی betforward
Friday, October 18, 2024
Friday, October 18, 2024

కడప కోసం ఎందాకైనా..

బద్వేల్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా
రూ.900 కోట్లతో అభివృద్ధి పనులకు సీఎం జగన్‌ శ్రీకారం

విశాలాంధ్ర ` కడప బ్యూరో :
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం కడప, బద్వేలులో రూ.900 కోట్లతో అనేక అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. వైఎస్‌ఆర్‌ కడప జిల్లాకు ఎంత చేసినా తక్కువేనని, బద్వేలును ఆదర్శంగా తీర్చిదిద్దుతానని అన్నారు. జిల్లాలో రెండు రోజుల పర్యటనలో భాగంగా రెండవ రోజు శుక్ర వారం సీఎం జగన్‌ కడప కలెక్టర్‌ కార్యాలయం వద్ద మహావీర్‌ సర్కిల్‌లో నగర అభివృద్ధి కోసం రూ.400 కోట్లతో అనేక పనులకు శంకుస్థాపనలు చేశారు. అక్కడ నుంచి రూ.80 కోట్లతో పుట్లంపల్లె వరకు ఆరు లైన్ల రోడ్డు, రైల్వే స్టేషన్‌ వరకు నాలుగు లైన్ల రోడ్డును ప్రారంభించారు. అనంతరం అక్కడ జరిగిన బహిరంగ సభలో జగన్‌ మాట్లాడుతూ కడప నగర రోడ్ల విస్తరణ, సుందరీకరణతో పాటు అనేక అభివృద్ధి పనులను మనసారా పూర్తి చేసి మంచి నగరాల సరసన కడపను చేర్చేలా కృషి చేస్తానని అన్నారు. వైఎస్‌ఆర్‌ కడప జిల్లాకు ఎంత చేసినా రుణం తీర్చుకోలేనిదని, ఎంత ఖర్చు చేసినా తక్కువేన న్నారు. నాన్న తరువాత కడపను ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదని అన్నారు. 2004`2009 మధ్యలో కడప నగరంలో అభివృద్ధి పనులు జరిగాయని, ఇప్పుడు మళ్లీ మంచి రోజులు వచ్చాయని, రూ.400 కోట్లతో అనేక అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశామని చెప్పారు. కడప రోడ్డు మార్గాన వస్తుంటే ఎంతో ఆహ్లాదకరంగా అనిపించిందని అన్నారు.
నగరంలో నాలుగు వరుసల రహదారి
కడప నగరంలోని కృష్ణా థియేటర్‌ నుంచి దేవునికడప వరకు రూ.101 కోట్లతో నాలుగు వరుసల రోడ్డుకు శంకుస్థాపన చేశామని ముఖ్యమంత్రి తెలిపారు. అన్న మయ్య సర్కిల్‌ నుంచి గోకుల్‌ లాడ్జి వరకు రూ.74 కోట్లతో రోడ్లను విస్తరిస్తామని, అంబేద్కర్‌ సర్కిల్‌ నుంచి వై జంక్షన్‌ వరకు రూ.62 కోట్లతో విస్తరణ పనులు చేస్తామని వివరించారు. వీటితోపాటు ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌ నుంచి పుట్లంపల్లి వరకు కూడా రోడ్ల విస్తరణ జరుగుతుందని, శంకుస్థాపన చేశామన్నారు. ఈ రోడ్ల విస్తరణ జరిగితే మంచి నగరాల జాబితాలో కడప చేరుతుందని పేర్కొ న్నారు. నాన్న హయాంలో బుగ్గవంక రక్షణ గోడ, ఐదు బ్రిడ్జిల నిర్మాణం చేపట్టారని, ఆ తరువాత దాన్ని పట్టించు కున్న వారెవరు లేరన్నారు. రూ.60 కోట్లతో బుగ్గవంక పెండిరగ్‌ పనులక, సీపీ బ్రౌన్‌ గ్రంథాలయంలో రూ.5.30 కోట్లతో నూతన భవనానికి శంకుస్థాపనలు చేసినట్లు ఆయన వివరించారు. కడప నగరం కొద్దిపాటి వర్షాలకే జలమయం అవుతోందని అన్నారు. తిలక్‌నగర్‌, మృత్యుంజ యకుంట, ఎన్జీవోకాలనీ, ఏఎస్‌ఆర్‌ నగర్‌, గంజికుంట కాలనీ వంటి ప్రాంతాలు జలమయమవుతున్నాయని, వీటికి శాశ్వత పరిష్కారంగా నాలుగు స్ట్రాంగ్‌ డ్రెయిన్లు మంజూరు చేస్తున్నామని తెలిపారు.
బద్వేల్‌లో రూ.500 కోట్లతో అభివృద్ధి పనులు
బద్వేల్‌ నియోజకవర్గంలో సుమారు రూ.500 కోట్లతో అభివృద్ధి పనుల శంకుస్థాపనలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ శ్రీకారం చుట్టారు. ఇండస్ట్రియల్‌ కోఆర్డినేటర్‌ శంకర్‌ అధ్వర్యంలో వైఎస్‌ఆర్‌ జగనన్న బడుగు వికాస్‌ పథకాన్ని ప్రారంభించారు. అనంతరం దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. దివంగత మాజీ ఎమ్మెల్యే డా.వెంకటసుబ్బయ్య చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసి బహిరంగ సభలో జగన్‌ మాట్లాడుతూ బద్వేల్‌ నియోజక వర్గం చాలా వెనుకబడిన ప్రాంతమని, దివంగత వైఎస్‌ఆర్‌ హయాంలో మాత్రం బ్రహ్మసాగర్‌కు 13 టీఎంసీల నీరు నింపారని, ఆ తరువాత ఇప్పుడు నిండుకుండలా ఉంద న్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.300 కోట్లు నిధులు విడుదల చేసి వెలుగొండ నుంచి 0.18 కి.మీ లైనింగ్‌ కార్యక్రమాన్ని 80 శాతం పూర్తి చేశామ న్నారు. అక్టోబరు నాటికి వంద శాతం పూర్తయితే నేరుగా బ్రహ్మసాగర్‌కు నీరు చేరుతుందని ఆయన వివరించారు. కుందు నదిపై లిఫ్టు ఇరిగేషన్‌ పెట్టి బ్రహ్మసాగర్‌కు నీరు తెచ్చేందుకు రూ.600 కోట్ల నిధుల విడుదల చేశామన్నారు. బద్వేల్‌ మున్సిపాలిటీలో రూ.130 కోట్లతో కొత్త సీసీ రోడ్లు, మూడు పార్కులు, అధునాతన కూరగాయల, చేపల మార్కెట్‌, వాణిజ్య సముదాయాలు, ఆరు స్మశాన వాటికల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామన్నారు. రూ.80 కోట్లతో లోయర్‌ సగిలేరు ప్రాజెక్టు వెడల్పుకు శంకుస్థాపన చేస్తున్నామని అన్నారు. రూ.10 కోట్ల వ్యయంతో విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ నిర్మాణాలకు, పోరుమామిళ్ల పట్టణంలో 3.4 కిమీ రెండు లైన్ల రోడ్డును నాలుగు లైన్ల రోడ్డుగా విస్తరణకు రూ.2.5 కోట్లతో శంకుస్థాపన చేశామన్నారు. రూ.22 కోట్లతో సగిలేరు నదిపై అట్లూరు మండలంలోని వేమలూరు వద్ద 22 కోట్లతో వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేయ డంతో 30 గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం కలుగు తుందని ఆయన వివరించారు. బద్వేల్‌కు ఇండస్ట్రియల్‌ పార్కు వస్తే నిరుద్యోగులకు, చదువుకున్న పిల్లలకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు వీలవుతుందని వీటిని మంజూరు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాలను రాజంపేట సబ్‌ కలెక్టర్‌ కేతాన్‌గార్గ్‌ పర్యవేక్షించారు.
కాగా కడప, బద్వేలులలో జరిగిన కార్యక్రమాలలో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌, ఉప ముఖ్యమంత్రి అంజద్‌బాషా, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, రైల్వేకోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, కడప ఎంపీ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్సీలు రామచంద్రయ్య, కత్తి నరసింహారెడ్డి, రమేష్‌ యాదవ్‌, జకియాఖానం, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, మైదుకూరు రఘురామరెడ్డి, రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి, ఎమ్మెల్యేలు రవీంద్ర నాథ్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి, కడప నగర మేయర్‌ సురేష్‌బాబు, జిల్లా కలెక్టర్‌ హరికిరణ్‌, హౌసింగ్‌ జేసీ ధ్యాన్‌చంద్ర, ఎస్పీ అన్బురాజన్‌, మాజీ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, వైసీపీ యువ నాయకుడు ఆదిత్యరెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ కృష్ణారెడ్డి, మార్కెట్‌ యార్డు వైస్‌ చైర్మన్‌ కె.రమణారెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ రాజగోపాల్‌రెడ్డి, అడా చైర్మన్‌ గురుమోహన్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ గోపాలస్వామి, ఉప్పర కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ రమణమ్మ, డ్వామా పీడీ యదుభూషణ్‌రెడ్డి, కువైట్‌ ఎన్‌ఆర్‌ఐలు దున్నూతల రాజగోపాల్‌రెడ్డి, గజ్జల నరసారెడ్డి, జడ్పీటీసీ అభ్యర్థి చిన్నపోలిరెడ్డి, పెద్ద పోలిరెడ్డి, పోరుమామిళ్ల ఎంపీపీ అభ్యర్థి చిత్తా విజయ్‌ప్రతాప్‌రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img