Friday, April 26, 2024
Friday, April 26, 2024

రాక్షస ఆర్డినెన్స్‌ రద్దు…

ఫెడరేషన్లతో చర్చలకు డి.రాజా డిమాండు
ప్రధాని మోదీకి లేఖ

న్యూదిల్లీ :
రక్షణ రంగ పరిధిలోని 41 ఆయుధ కర్మాగారాలను ఏడు కార్పొరేషన్లుగా విభజించడమే కాకుండా ఉద్యోగుల న్యాయమైన హక్కులను హరించేలా ఉన్న రాక్షస ఆర్డినెన్స్‌ను తక్షణమే ఉపసంహరించుకోవాలని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా డిమాండు చేశారు. ఉద్యోగుల ఫెడరేషన్లతో చర్చలను పునరుద్ధరించి శాంతియుతంగా సమస్యను పరిష్కరించాల న్నారు. ఆయుధ కర్మాగారాల్లో సమ్మెలపై పూర్తిగా నిషేధం విధించే నిరంకుశ రక్షణ సేవల ఆర్డినెన్స్‌ 2021ను తీసుకొచ్చి కార్మికుల ప్రజాస్వామ్య, రాజ్యాంగ, న్యాయమైన హక్కులను హరించడాన్ని సీపీఐ తీవ్రంగా ప్రతిఘటిస్తోందని శుక్రవారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఈ రాక్షస ఆర్డినెన్స్‌ను రాష్ట్రపతి ఆమోదించడం షాక్‌కు గురిచేసిందని పేర్కొన్నారు. 41 ఆయుధ కర్మగారాల్లో పనిచేసే వర్కర్ల హక్కుల హరణ తగదని, ఈ రాక్షస ఆర్డినెన్స్‌ను తక్షణమే వెనక్కు తీసుకోవాలని, ఉద్యోగి సంఘాలతో చర్చలు జరపాలని రాజా సూచించారు. కేంద్రప్రభుత్వ ఉద్యోగికి రాజ్యాంగం కల్పించిన రక్షణకు విరుద్ధంగా దర్యాప్తు కూడా లేకుండా ఉద్యోగు లను తొలగించడంÑ సమ్మెకు పిలుపునిచ్చే యూనియన్ల నేతలను, అందులో పాల్గొనే ఉద్యోగులను నిర్బంధించడం వంటి నిబంధ నలతో ఈడీఎస్‌ఓ `2021 ఉందన్నారు. యాజమాన్యాలు తమ వాస్తవ సమస్యలను, ఇబ్బందులను పట్టించుకోని పరిస్థితిలో మరో గత్యంతరం లేక ట్రేడ్‌యూనియన్లు, ఉద్యోగులు సమ్మె బాట పడతారన్నారు. ప్రస్తుతం రక్షణశాఖ/కేంద్రప్రభుత్వం యాజమాన్యంలా 41 ఆయుధ కర్మాగారాలను ఏడు కార్పొరేషన్లుగా విభజించే నిర్ణయం తీసుకుందని, దీనిని కార్మికులంతా ప్రతిఘటిస్తున్నారని డి.రాజా పేర్కొన్నారు. గత ఒప్పందాలను పట్టించు కోకుండా హడావిడిగా విభజన నిర్ణయాన్ని కేంద్రం తీసుకుందని ఉద్యోగులు ఆరోపిస్తు న్నారు. చీఫ్‌ లేబర్‌ కమిషనర్‌ కూడా చర్చలను అర్థాంతరంగా ముగించడాన్ని ఖండిస్తున్నారని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. ఆర్డెనెన్స్‌ ఫ్యాక్టరీల మెరుగుదలకు ఫెడరేషన్లు చేసిన ప్రత్యామ్నాయ సిఫార్సులనూ డీడీపీలోని సీనియర్‌ అధికారి పట్టించుకోలేదన్నారు. ఈడీఎస్‌ఓ2021, ఆయుధ కర్మాగారాలను ఏడు కార్పొరేషన్లగా విభజించే నిర్ణయం తీసుకునే ముందు పైన పేర్కొన్న అంశాలన్నీ మీ దృష్టికి వచ్చాయా లేదా సందేహం కలుగుతోందని మోదీని ఉద్దేశించి డి.రాజా పేర్కొన్నారు. ఆయుధ కర్మాగారాలలో ఒకటి కూడా మూతబడదని ఫెడరేషన్లకు ప్రభుత్వం రాతపూర్వక హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. ఫ్యాక్టరీ కార్మికుల సర్వీసు షరతులను పరిరక్షిస్తామని రక్షణ మంత్రి హామీ ఇచ్చారన్నారు. 76వేల ఉద్యోగులు కేంద్రప్రభుత్వ ఉద్యోగులు / రక్షణరంగ ఉద్యోగులుగానే ఉంటారా.. వారికివ్వబడే అన్ని వసతులు కొనసాగుతాయా అన్నదానిపైనా అధికారిక ప్రకటన లేదని రాజా అన్నారు. ఈ పరిస్థితుల్లో తమను నిరక్ష్యం చేస్తున్నారని, భవితవ్యం అంధకారం అవుతుందన్న ఆందోళనలో ఉద్యోగులు, ట్రేడ్‌ యూనియన్లు సమ్మెకు సిద్ధమయ్యాయని రాజా పేర్కొన్నారు. ఉద్యోగుల ప్రజాస్వామిక హక్కులను హరించడం మానుకొని ఫెడరేషన్లను చర్చలకు పిలిచి రాజీకి ప్రయత్నించడం ప్రభుత్వ బాధ్యత అని సూచించారు. ఈ వ్యవహారంలో స్వయంగా జోక్యం చేసుకోవాలని, వివాదాన్ని పరిష్కరించు కునేలా రక్షణ శాఖకు మార్గదర్శకం చేయాలని ప్రధానిని కోరారు. ఇందుకోసం ముందుగా ఈడీఎస్‌ఓ2021ను ఉపసంహరించుకోవాలన్నారు. తన ఈ లేఖపై ప్రధాని కార్యాలయం నుంచి సానుకూల స్పందనను ఆకాంక్షిస్తున్నట్లు డి.రాజా పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img