Wednesday, May 1, 2024
Wednesday, May 1, 2024

అల్పపీడనం రూపంలో మరో గండం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని వర్షం వీడటం లేదు. ఇప్పటికే వర్షాలు,, భారీ వరదలతో రాయలసీమ జిల్లాలు అతలాకుతలమయ్యాయి. రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇప్పటికీ అనేక గ్రామాలు వరద ముంపులోనే మగ్గుతున్నాయి. దీని నుంచి బయటపడక ముందే..ఏపీకి వరుణుడి నుంచి మరో ఉపద్రవం పొంచి ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిరదని ఐఎండీ ప్రకటించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ జారీ చేసిన ఈ హెచ్చరికలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. .ఈనెల 29 నాటికి దక్షిణ అండమాన్‌ వద్ద బంగాళాఖాతంలో ఈ అల్పపీడనం ఏర్పడొచ్చని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఆ తరువాత 48 గంటల్లో ఇది మరింత బలపడి పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించొచ్చని అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఒకటి, రెండు చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముందన్నారు.దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి వర్షాలతోపాటు ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురవొచ్చని అంచనా వేస్తున్నారు. ఇక శనివారం నాడు రాష్ట్రమంతటా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని, దక్షిణ కోస్తాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడొచ్చని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అంచనా వేసింది.బంగాళాఖాతంలో కొమరిన్‌ ప్రాంతం, శ్రీలంక తీరం మీదుగా ఉపరితల ఆవర్తనం ఏర్పడి ఉందని, దీని ప్రభావంతో దక్షిణాదిలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు ప్రకటించారు. అటు అనంతపురం, చిత్తూరు, కడప, నెల్లూరులో అధికారులు హై అలెర్ట్‌ ప్రకటించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img