Tuesday, April 30, 2024
Tuesday, April 30, 2024

రైల్వేట్రాక్‌ ధ్వంసం చేసిన మావోయిస్టులు

పట్టాలు తప్పిన 18 వ్యాగన్లు

దంతెవాడ : మావోయిస్టులు రైల్వే ట్రాక్‌ను ధ్వంసం చేయడంతో గూడ్స్‌ రైలు పట్టాలు తప్పింది. 18 వ్యాగన్లు, మూడు లోకోమోటివ్‌లు పట్టాలు తప్పినట్లు పోలీసు అధికారులు శనివారం తెలిపారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లా కిరండల్‌విశాఖపట్నం రైల్వే సెక్షన్‌లో శుక్రవారం రాత్రి 8.30 గంటలకు చోటుచేసుకుంది. ఇది దట్టమైన అటవీప్రాంతం కావడం, మావోయిస్టుల ప్రాబల్యం అధికంగా ఉండటంతో రైల్వేట్రాక్‌ను వారు తేలికగా ధ్వంసం చేసినట్లు పోలీసులు చెప్పారు. ప్రమాదంలో ఎవరూ మరణించలేదని, అయితే జగ్దల్‌పూర్‌కిరండల్‌ మధ్య రైలు సర్వీసులకు అంతరాయం కలిగినట్లు వెల్లడిరచారు. భన్సీ, కమలూర్‌ స్టేషన్ల మధ్య మావోయిస్టులు రైల్వే ట్రాక్‌ను ధ్వంసం చేశారని, దీనివల్ల గూడ్స్‌కు సంబంధించి మూడు ఇంజిన్లు, 18 వ్యాగన్లు పట్టాలు తప్పాయని దంతెవాడ ఎస్పీ అభిషేక్‌ పల్లవ వివరించారు. గూడ్స్‌ రైలు ముడి ఇనుముతో బచ్చెలి నుంచి విశాఖపట్నం వెళుతుందని ఆయన తెలిపారు. రైలు సర్వీసుల పునరుద్ధరణ కోసం భద్రతా దళాలు, రైల్వేసిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. శనివారం మావోయిస్టులు బంద్‌కు పిలుపునిచ్చారని, దీనికి మద్దతుగా రైల్వేట్రాక్‌ను ధ్వంసం చేశారని పోలీసులు తెలిపారు. మహారాష్ట్రలోని గచ్చిబౌలి ఎన్‌కౌంటర్‌కు నిరసనగా మావోయిస్టులు బంద్‌కు పిలుపునిచ్చిన విషయం విదితమే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img