Friday, May 3, 2024
Friday, May 3, 2024

భారత నేవీ చీఫ్‌గా హరికుమార్‌ బాధ్యతల స్వీకరణ

న్యూదిల్లీ : భారత నావికాదళం నూతన అధ్యక్షుడిగా అడ్మిరల్‌ ఆర్‌ హరి కుమార్‌ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకూ ఆ పదవిలో ఉన్న అడ్మిరల్‌ కరంబీర్‌ సింగ్‌ పదవీ విరమణ చేయడంతో హరి కుమార్‌ బాధ్యతల్ని చేపట్టారు. హరికుమార్‌ 1983లో నావికా దళంలోని కార్యనిర్వాహక శాఖలో ఉద్యోగంలో చేరారు. 39 ఏళ్ల సుదీర్ఘమైన వృత్తి జీవితంలో విశిష్టమైన సేవలు అందించారు. ఐఎన్‌ఎస్‌ నిశాంక్‌, ఐఎన్‌ఎస్‌ కోరా, గైడెడ్‌-మిసైల్‌ డిస్ట్రాయర్‌ ఐఎన్‌ఎస్‌ రణవీర్‌ నౌకలతో పాటు భారత నౌకా దళానికి చెందిన కీలకమైన విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్‌ విరాట్‌కు కూడా హరికుమార్‌ నాయకత్వం వహించారు. పశ్చిమ నౌకాదళ కమాండ్‌కు ఫ్లాగ్‌ ఆఫీసర్‌ కమాండిరగ్‌ ఇన్‌ చీఫ్‌గా పనిచేస్తూ తాజాగా నౌకాదళం అధిపతిగా పదోన్నతి పొందారు. బోధన, నేవీ నియామక విభాగంలోనూ సేవలందించిన అయన గతంలో పరమ విశిష్ట సేవా పతకం (పీవీఎస్‌ఎం), అతి విశిష్ట సేవా పతకం (ఎవీఎస్‌ఎం), విశిష్ట సేవా పతకం (వీఎస్‌ఎం) అందుకున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img