Tuesday, May 7, 2024
Tuesday, May 7, 2024

పారదర్శకంగా కొవిడ్‌ డేటా నిర్వహణ : కేంద్రం


కరోనా సెకండ్‌వేవ్‌లో అత్యధికంగా మరణాలు సంభవించాయి. ప్రభుత్వం అధికారికంగా వెల్లడిరచిన కరోనా మరణాల కంటే ఎక్కువగా మరణాలు సంభవించాయని పలు మీడియా కథనాలు వెల్లడిరచడాన్ని కేంద్ర ప్రభుత్వం త్రోసిపుచ్చింది. కొవిడ్‌ డేటా నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తోందని, కరోనా సంబంధిత మరణాలను నమోదు చేసేందుకు సమర్ధ వ్యవస్థ ఇప్పటికే ఉందని స్పష్టం చేసింది. అధిక మరణాలను చూపేందుకు హెల్త్‌ మేనేజ్‌మెంట్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ (హెచ్‌ఎంఐఎస్‌), సివిల్‌ రిజిస్ట్రేషన్‌ సిస్టమ్‌ (సీఆర్‌ఎస్‌) డేటాను పోల్చిన నివేదికలను కేంద్రం తోసిపుచ్చింది. కారణాలు తెలియని 2,50,000కు పైగా మరణాలను మీడియా కధనాలు కొవిడ్‌ మరణాలుగా పరిగణించాయని ఆక్షేపించింది. అవి ఎలాంటి ఆధారాలు లేని ఊహాజనిత మీడియా నివేదికలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img