Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

నీట్‌ పీజీ 2022 పరీక్ష వాయిదా

పోస్టు గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ కోర్సుల కోసం నిర్వహించాల్సిన ‘నీట్‌ పీజీ ప్రవేశ పరీక్ష 2022’ పరీక్ష వాయిదా పడిరది. షెడ్యూల్‌ ప్రకారం, ఈ పరీక్ష మార్చి 12న జరగాల్సి ఉండగా, 6 నుంచి 8 వారాలపాటు వాయిదా వేయాలని కేంంద్ర ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ఈ మేరకు పరీక్షను వాయిదా వేయాలని నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌కు తెలిపింది. నీట్‌ పీజీ`2021 కౌన్సెలింగ్‌ జరగబోతున్నందు వల్ల ఈ పరీక్షను వాయిదా వేయాలని మెడికల్‌ డాక్టర్ల నుంచి అనేక వినతులు వస్తున్నట్లు ఆరోగ్య సేవల విభాగం డైరెక్టర్‌ శుక్రవారం జారీ చేసిన ఆదేశాల్లో తెలిపారు. 2022 మే/జూన్‌ నెలలో జరిగే పీజీ కౌన్సెలింగ్‌ 2022లో చాలా మంది ఇంటర్న్స్‌ పాల్గొనే అవకాశం ఉండదని చెప్తున్నారని పేర్కొన్నారు. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని నీట్‌ పీజీ 2022 పరీక్షను ఆరు నుంచి ఎనిమిది వారాలపాటు వాయిదా వేయాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ నిర్ణయించినట్లు ఈ నోటీసులో తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img