Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

కొనసాగుతున్న వ్యాక్సినేషన్‌


దేశవ్యాప్తంగా 39 కోట్లకు పైగా మోతాదులు
దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా 39 కోట్లకు పైగా మోతాదులను అందించారు. మొదట్లో వేగంగా ప్రారంభమైన వ్యాక్సినేషన్‌ కార్యక్రమం వివిధ కారణాల వల్ల మధ్యలో మందగించింది. ఈ దశలో వేగవంతంగా టీకాలను అందించేందుకు కేంద్రం ప్రయత్నాలు కొనసాగిస్తోంది.కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడిరచిన వివరాల ప్రకారం, బుధవారం సాయంత్రం వరకు వచ్చిన సమాచారం మేరకు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ల సంఖ్య 39.10 కోట్లకు పెరిగింది.దేశవ్యాప్తంగా బుధవారం 32.10 లక్షలకు పైగా టీకాలు వేశారు. వీరిలో 18 నుంచి 44 సంవత్సరాల వయస్సులో 13.82 లక్షల జనాభాకు మొదటి, 1.57 లక్షల మందికి రెండవ మోతాదు ఇచ్చారు. 37 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో, ఈ వయస్సు వారిలో మొత్తం 11.78 కోట్ల మందికి మొదటి మోతాదు ఇవ్వడం జరిగింది.8 రాష్ట్రాల్లో, 18-44 సంవత్సరాల వయస్సు గల 50 లక్షల మందికి మొదటి మోతాదు టీకా ఇచ్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img