Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

ముంచుకొస్తున్న ‘అసని’ తుఫాను…

తీరప్రాంతాలకు భారీ వర్ష సూచన
అప్రమత్తమైన అధికారులు

ఈ ఏడాది తొలి తుఫాను అయిన అసని తుఫాను కారణంగా అండమాన్‌ నికోబాం దీవుల్లో సోమవారం వర్షం, బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో ఉత్తర దిశగా అల్ప పీడనం ఏర్పడిరది. దీని ప్రభావంతో ఈరోజు అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం అల్పపీడనం ఈ ఉదయం తీవ్ర పీడనంగా మారింది. సోమవారం సాయంత్రం నాటికి అది తుఫానుగా మారుతుంది. శనివారం సాయంత్రం వరకు ఆగ్నేయ, దక్షిణ అండమాన్‌ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వేగంగా ఉత్తర దిశగా కదులుతున్నట్లు ఐఎండీ అధికారులు తెలిపారు. సోమవారం గంటకు 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. అండమాన్‌ నికోబార్‌ తర్వాత తుపాను ఉత్తర దిశగా పయనించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కాగా మార్చి 22 న, ఉత్తర దిశలో ఇది మయన్మార్‌ ఆగ్నేయ బంగ్లాదేశ్‌ తీరాలకు చేరుకుంటుందని అధికారులు తెలిపారు. ఎవరైనా ప్రయాణికులు ఈ తుఫానులో చిక్కుకుంటే, వారికి సహాయం చేయడానికి హెల్ప్‌లైన్‌ నంబర్‌ 03192 245555/232714 మరియు టోల్‌ ఫ్రీ నంబర్‌ 1 800 345 2714 జారీ చేశారు. దాదాపు 150 మంది నేషనల్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌ సిబ్బందిని మోహరించారు.మరో పక్క తుఫాను ‘అసాని’ అండమాన్‌ మరియు నికోబార్‌ దీవుల తీరానికి చేరుకునే అవకాశం ఉన్నందున, లోతట్టు ప్రాంతాల నుండి ప్రజలను తరలించడంతో సహా ద్వీపసమూహంలో పరిస్థితిని ఎదుర్కోవటానికి అన్ని ఏర్పాట్లు చేస్తునాÊ్నరు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img