Tuesday, April 30, 2024
Tuesday, April 30, 2024

‘సివిల్‌’ పరీక్ష నిబంధనలు మార్చలేం : కేంద్రం

న్యూదిల్లీ: సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష (సీఎస్‌ఈ)ను ఎన్నిసార్లు రాయవచ్చు, వయోపరిమితికి సంబంధించి ప్రస్తుత నిబంధనలను మార్చడం సాధ్యం కాదని కేంద్రప్రభుత్వం గురువారం రాజ్యసభకు తెలియజేసింది. కోవిడ్‌ మహమ్మారి కారణంగా సీఎస్‌ఈ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు, అదనపు ప్రయత్నంపై అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞాపనలు అందినట్లు సిబ్బంది శాఖ సహాయమంత్రి జితేంద్రసింగ్‌ తెలిపారు. కొంతమంది ఈ అంశంపై సుప్రీంకోర్టులో రిట్‌ పిటిషన్లను కూడా వేసినట్లు మంత్రి పేర్కొన్నారు. ‘గౌరవనీయ సుప్రీం కోర్టు తీర్పుల ఆధారంగా, ఈ విషయం పరిగణనలోకి తీసుకోవడం జరిగింది. సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షకు సంబంధించి ప్రయత్నాల సంఖ్య, వయోపరిమితికి సంబంధించి ఇప్పటికే ఉన్న నిబంధనలను మార్చడం సాధ్యపడలేదు’ అని ఆయన రాతపూర్వక సమాధానంలో వివరించారు. కోవిడ్‌-19 మార్గదర్శకాలను అనుసరించడం ద్వారా పరీక్షలను సజావుగా నిర్వహించడానికి యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్‌సీ), స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సి) అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయని మంత్రి వెల్లడిరచారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img