Saturday, May 4, 2024
Saturday, May 4, 2024

ధరల నియంత్రణకు ఓ విధానం..కేంద్రాన్ని డిమాండ్‌ చేసిన మమత

కోల్‌కతా: ఇంధనం, ఇతర నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణకు కేంద్రం ఏమీ చేయడం లేదని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గురువారం విమర్శించారు. ధరల పెరుగుదల అదుపునకు ఓ విధానం రూపొందించాల్సిన అవసరం ఉందని డిమాండ్‌ చేశారు. దేశంలోని ఆర్థిక పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లు ఉందని, ఆర్థిక పరిస్థితి మరింత అధ్వానంగా మారిందని మమత ఆరోపించారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో ఉద్యోగులకు వేతనాలు ఇవ్వడం కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు కష్టంగా ఉంటుందని మమత భయాన్ని వ్యక్తం చేశారు. జీఎస్‌టీ రుణాలను తక్షణమే రాష్ట్రాలకు అందజేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాజకీయ నాయకులను వేధించడానికిగాను సీబీఐ, ఈడీలను ఉపయోగించడానికి బదులుగా పెరుగుతున్న ధరల అదుపునకు మార్గాలు అన్వేషించాలని మోదీ సర్కారుకు హితవు పలికారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img